
Fish Venkat : నిజంగా సిగ్గు పడాలి.. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రశ్నలు..!
Fish Venkat : ఫిష్ వెంకట్ .. తన సినిమాలతో ఎంతో మెప్పించిన నటుడు. కానీ ఆ నటుడు చివరికి ఒక్క “కిడ్నీ మార్పిడి”కి అవసరమైన 60 లక్షలు దొరకక, మౌనంగా కన్నుమూయడం జరిగింది. ఇది కేవలం కుటుంబ సభ్యుల బాధ కాదు, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తలదించుకోవాల్సిన విషాదం. వైద్యానికి 60 లక్షలు కావాలన్నారు… అయిన ఇండస్ట్రీ ఎందుకు సాయం చేయలేకపోయింది?
Fish Venkat : నిజంగా సిగ్గు పడాలి.. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రశ్నలు..!
60 లక్షలు ఉండుంటే నాన్న బ్రతికేవారు అని వెంకట్ కూతురు చెబుతుంది. పరిశ్రమలో పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఉన్నా – ఒక్కొక్కరూ రూ. 10,000 చొప్పున ఇచ్చినా 600 మంది చాలు… మొత్తం అవసరమైన డబ్బు పూర్తవుతుంది కదా? అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నిజంగా ‘సినీ కుటుంబం’ ఉందా? ఎన్నో సంఘాలు ఉన్నాయి అంటారు…
అవి నిజంగా ఏ నటుడి కోసం పనిచేస్తున్నాయో తెలియదు. ఒక్క ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా, అత్యవసర సహాయ నిధి అయినా ఉన్నాయా? లేక వేదికలపై మాటలకే పరిమితమా? ఎందరో స్టార్లతో కలిసి వర్క్ చేసిన హాస్యనటుడు ఫిష్ వెంకట్. కానీ అవసరమైన సమయంలో అతడికి సాయం చేయలేక ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది. డబ్బు లేకపోతే ఎంతటి నటుడైనా ప్రాణం కోల్పోతాడన్న విషయాన్ని ఇది నిజం చేసింది. ఇది వ్యక్తిగతంగా కాదు… మొత్తం పరిశ్రమ వైఫల్యం. ఈ రోజు వెంకట్… రేపు ఇంకొకరు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా… జాగ్రత్త పడండి. మారండి అంటూ కొందరు నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.
Kavitha TRS Party : తెలంగాణ రాజకీయ యవనికపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…
Kara Movie Review : స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 'కుబేర' వంటి చిత్రాలతో అలరించిన…
Exit Polls : భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన…
Varanasi Movie : భారతీయ సినిమా ప్రస్తుతం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది.…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
This website uses cookies.