Home » Entertainment » Four Big Surprises To Junior Ntr Fans
Entertainment

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ సర్ ప్రైజ్.. రెడీగా ఉన్నారా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: May 12, 2023, 7:12 pm
Advertisement

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఒక తెలుగు సినిమా హీరో.. ప్రపంచ స్థాయి హీరోగా మారడం అనేది మామూలు విషయం కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వేరు.. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ వేరు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ ఏ సినిమా తీసినా అది సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఇక.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో టాప్ లో ఉన్నారు.

Advertisement

four big surprises to junior ntr fans

గ్లోబల్ స్టార్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దాని తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు ఏం లేనందున ఎన్టీఆర్ నటించిన పాత సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన సింహాద్రి సినిమా, ఆది సినిమాను రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Advertisement

JR NTR 32 movie update

Junior NTR : ఈనెల 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే

ఎన్టీఆర్ బర్త్ డేకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అభిమానుల్లో సందడి మొదలైంది. ఇక.. తన పుట్టిన రోజు నాడే జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ ప్రకటిస్తారట. ఒకటి కాదు.. రెండు కాదు.. తన నాలుగు సినిమాలకు సంబంధించిన సర్ ప్రైజ్ లు రానున్నాయట. ఎన్టీఆర్ 30 మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు.. ఎన్టీఆర్ 31 వ సినిమా వార్ 2 నుంచి కూడా పోస్టర్ వస్తుంది. మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్ డేట్స్ కూడా రానున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా రానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అన్ని విషయాలు తెలుస్తాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి