Home » Entertainment » Funky Movie First Day Box Office Collections
Entertainment

Funky Movie First Day Collections : ‘ఫంకీ’ బాక్సాఫీస్ హంగామా .. తొలి రోజు విశ్వ‌క్ సేన్ మూవీకి ఎంత క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 14, 2026, 7:00 am
Advertisement

Funky Movie First Day Collections : మాస్ కా దాస్‌గా పేరుపొందిన విశ్వక్ సేన్ vishwak sen హీరోగా, కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ఫంకీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Funky Movie First Day Collections : ‘ఫంకీ’ బాక్సాఫీస్ హంగామా .. తొలి రోజు విశ్వ‌క్ సేన్ మూవీకి ఎంత క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే..!

Funky Movie First Day Collections బ‌డ్జెట్ ఎంత‌ ?

‘ఫంకీ’ సినిమా మొత్తం నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్లతో కలిపి సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మీడియం రేంజ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఇండస్ట్రీ టాక్. సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా మంచి డీల్ సాధించింది. నైజాం – రూ.4 కోట్లు, సీడెడ్ – రూ.1.25 కోట్లు, ఆంధ్రా – రూ.5 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.75 లక్షలు, ఓవర్సీస్ – రూ.2 కోట్లు. మొత్తం వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. లాభాల్లోకి రావాలంటే రూ.14 కోట్ల షేర్, దాదాపు రూ.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

అమెరికా ప్రీమియర్స్‌కు మంచి స్పందన లభించింది. వందలాది షోలలో వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవ్వగా, ప్రీమియర్ షోల ద్వారా లక్ష డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు డిస్ట్రిబ్యూషన్ వర్గాల సమాచారం. యూత్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం ఓవర్సీస్ మార్కెట్‌కు ప్లస్ అయ్యింది. పాజిటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో మంచి టాక్ రావడంతో మొదటి రోజే థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, విజయవాడ నగరాల్లో ఎక్కువ షోలు ప్రదర్శించగా మధ్యాహ్నం వరకే గణనీయమైన వసూళ్లు నమోదయ్యాయి. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.4–5 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తానికి కామెడీ, యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో వచ్చిన ‘ఫంకీ’ మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు కీలకం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి