Geeta Madhuri Vs Rashmi Gautham
Rashmi Gautham : నటిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్‌గా సత్తా చాటిన అందాల భామ రష్మీ గౌతమ్. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా మరింత దగ్గరైయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా సత్తా చాటుతుంది. ప్రస్తుతం నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా చేస్తుంది.నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మాసీ లుక్కులో కనిపించడం,
రష్మీ గౌతమ్ కూడా రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది వరకు వదిలిన టీజర్, పాటలు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారట. అందుకే ప్రమోషన్స్ ప్రారంభించారట. కానీ రష్మీ మాత్రం సహకరించడం లేదట. ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఇక ప్రముఖ సింగర్ గీతామాధురి , యాంకర్ జబర్దస్త్ రష్మీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. నందూ, అతడి భార్య గీతామాధురి, ఇటు రష్మి కాంట్రవర్సీ పోస్టులు పెట్టుకున్నారు.
Geeta Madhuri Vs Rashmi Gautham
నందు అయితే రష్మీ మా ఫోన్లు ఎత్తడం లేదు.. ఇప్పటికే 32 సార్లు ఫోన్లు చేశామని మండిపడ్డాడు. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ల కోసం చేస్తోన్న స్టంట్లే అని అర్థమవుతూనే ఉంది. అయితే చివరకు అంతా కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక రష్మీ విషయానికి వస్తే.. ఈ అమ్మడు తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
This website uses cookies.