Home » Entertainment » Geetha Madhuri Hausband Pics Goes Viral
Entertainment

Geetha Madhuri : ఒక‌డిని చూసి ఇంకొక‌డు.. అర్ధ‌నగ్నంగా గీతా మాధురి భ‌ర్త‌.. నోటికొచ్చిన‌ట్టు తిట్టేస్తున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: July 25, 2022, 11:49 pm
Advertisement

Geetha Madhuri : అమ్మాయిలే ఎక్స్ పోజింగ్ చేయాలా మాకేం త‌క్కువ అన్న‌ట్టు హీరోలు న‌గ్నంగానో లేదంటే అర్ధ‌నగ్నంగానో ర‌చ్చ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫీమేల్ యాక్టర్స్ సెమీ న్యూడ్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడం దాదాపు సర్వసాధారణం. కానీ, మేల్ యాక్టర్స్ చిత్రాలు ఇప్పుడు వాటిని డామినేట్ చేస్తున్నాయి. ఇటీవలే లైగర్ చిత్రానికి చెందిన ఓ ఫొటోలో లీడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ న్యూడ్‌గా ఫోజు ఇచ్చాడు. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆ త‌ర్వాత వరసలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కూడా చేరారు. మన హైదరాబాదీ, బ్యాండ్మెంటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న విష్ణు విశాల్ న్యూడ్ పిక్స్ షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

Advertisement

Geetha Madhuri : ఇదేం పోక‌డ‌..

విష్ణు సెమీ న్యూడ్ ఫొటో తీసిందే గుత్తాజ్వాల. ఈ విషయాన్ని విష్ణు విశాల్ ఆ ఫొటో గురించిన పోస్టులో పేర్కొన్నారు. తన సెమీ న్యూడ్ ఫొటోను పోస్టు చేసి ట్రెండ్‌లో దాదాపుగా జాయిన్ అయ్యానని పేర్కొన్నారు. సతీమణి గుత్తాజ్వాల ఫొటోగ్రాఫర్ మారిన వేళ అంటూ కామెంట్ చేశారు.ఇక వీటిపైనే నానా ర‌చ్చ సాగుతున్న స‌మ‌యంలో గీతా మాధురి భ‌ర్త‌, న‌టుడు నందు కూడా ఇందులో చేరిన‌ట్టు తెలుస్తుంది. నందు వారంతా కాక‌పోయిన కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తూ ఔరా అనిపించాడు.

Geetha Madhuri Hausband Pics Goes Viral

Advertisement

టవల్ కట్టుకుని నిలబడ్డ నందు… తన సిక్స్ ప్యాక్‌ను అందరికీ చూపిస్తున్నట్టుగా అనిపించింది. మొత్తానికి నందు మాత్రం నెట్టింట్లో ఈ ఫోటో షూట్‌తో ట్రెండ్ అవుతున్నాడు. ఇత‌ను ర‌ణ్‌వీర్, విష్ణు విశాల్‌ని ఆద‌ర్శంగా తీసుకొని ఇలా ఫొటొ షూట్ చేశాడా, లేక క్యాజువ‌ల్‌గా చేశాడో తెలియ‌దు కాని నందు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచాడు. మ‌నోడు సినిమాలు లేక‌పోయిన అప్పుడ‌ప్పుడు ఇలాంటి విష‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. చివ‌రిగా రష్మీ గౌతమ్‌తో కలిసి బొమ్మబ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించాడు. కానీ ఈ చిత్రం అప్డేట్ మాత్రం ఇంత వరకు రాలేదు. కరోనా కంటే ముందు ఈ సినిమాను భారీ ఎత్తన ప్రమోట్ చేవౄరు. ఇంత వ‌ర‌కు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి