Home » Entertainment » Getup Sheen Begging For Help
Entertainment

Getup Seenu : సాయం చేయాలని వేడుకుంటున్న గెటప్ శీను.. అసలేమైంది..?

Authored By
mallesh
The Telugu News | Published on: January 30, 2022, 4:00 pm
Advertisement

Getup Seenu : బుల్లితెర స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శీను ఒకరు. సుడీగాలి సుధీర్ టీంలో తన దైన గెటప్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాడు. తనదైన పంచెస్, కామెడీ టైమింగ్ తో పాటు కొత్త కొత్త గెటప్స్‌తో జబర్దస్త్ వేదికగా నవ్వుల రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఓ వైపు స్టాండప్ కామెడీ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు పోషించకుంటూ తనదైన విధంగా ప్రేక్షకులను అలరింపజేస్తున్నాడు. సుడీగాలి సుధీర్, ఆటోరాంప్రసాద్, గెటప్ శీను ఈ ముగ్గురు ఒక సూపర్ హిట్ కాంబినేషన్. వీరితో అప్పుడప్పుడు సన్నీ జాయిన్ అవుతుంటాడు.

Advertisement

గెటప్ శీను జబర్దస్త్ లో షో ద్వారా క్లిక్ అయ్యాక చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.విభిన్న ప్రొగ్రామ్స్‌, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్‌లో కూడా తనదైన కామెడీ చేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. శీనుకు తోడుగా సుధర్, రాంప్రసాద్ కూడా ఉంటారు. ఒక్కోసారి శీను ఒక్కడే మేనేజ్ చేస్తుంటాడు. తమ జీవితంలో వెలుగు తీసుకొచ్చిన షో జబర్దస్త్ అని ఈ త్రి మంకీస్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తన కామెడీ టైమింగ్‌తో శీను ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్, సైడ్ రోల్స్ చేశాడు. బుల్లితెరతో పాటు అటు వెండితెరమీద కూడా శీను చాలా బిజీగా మారిపోయాడు. అయితే, ఉన్నట్టుండి శీను ఒక్కసారిగా సాయం కోరుతూ అందరినీ షాక్‌కు గురిచేశాడు.

getup sheen begging for help

Advertisement

Getup Seenu : సాయం ఆశించేతగా ఏమైంది..

గెటప్ శీను సాయం కోరుతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి అతని కోసం కాదట సాయం కోరేది. రాజమండ్రిలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆనంద్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఖర్చులకు రూ.4లక్షలు అవుతాయని వైద్యులు వెల్లడించారు. వారి కుటుంబం వద్ద అంత డబ్బులు లేకపోవడంతో వారు శీను దృష్టికి తీసుకురాగా.. శీను తను కొంత సాయం చేయడంతో పాటు అభిమానులతో పాటు ఇతరులను కూడా సాయం చేసి ఆనంద్ లైఫ్ సేవ్ చేయాలని కోరుతున్నాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి