Home » Entertainment » Getup Srinu Defamed Punch Prasad In Sridevi Drama Company Show
Entertainment

Getup Srinu : పంచ్ ప్రసాద్ పరువు తీసేశారుగా.. స్టేజ్ మీద నిజంగా కొట్టేసిన గెటప్ శ్రీను

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 27, 2021, 9:40 pm
Advertisement

Getup Srinu : బుల్లితెర ప్రసారమౌతున్న కార్యక్రమాలను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం తరహాలోనే ఈ కార్యక్రమం కూడా ప్రసారమౌతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రసారం అవుతూ ఎంతో వినోదాన్ని అందిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా గెటప్ శీను అద్భుతమైన స్కిట్ ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించడమే కాకుండా పంచ్ ప్రసాద్ పరువు మొత్తం తీసేసాడు.

Advertisement

ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా గెటప్ సీను తాతయ్య వేషం వేసుకుని చిన్నప్పుడు తన మనవళ్ళను స్కూల్ కి ఏవిధంగా పంపించాలని ఆశ ఉండేదో, తన కోరికను హైపర్ ఆది పంచ్ ప్రసాద్ రూపంలో తీర్చుకున్నారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళమని మారాం చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా వారికి నాలుగు దెబ్బలు వేస్తారో గెటప్ సీను కూడా నిజమైన కర్రతో హైపర్ ఆది, పంచ్ ప్రసాద్ పై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ స్కిట్ లో భాగంగా గెటప్ సీను చేతిలో పంచ్ ప్రసాద్ దారుణంగా బలయ్యాడు.

Getup srinu defamed punch prasad in sridevi drama company show

Advertisement

Getup Srinu : నిజమైన కర్రతో బాదిన గెటప్ శీను

ఈ స్కిట్ లో భాగంగా గెటప్ శీను హైపర్ ఆదికి స్నానం చేయించి తనని మేకప్ చేస్తాడు అలాగే ప్రసాద్ కి కూడా మేకప్ చేస్తూ పౌడర్ వేసి, దిష్టి చుక్క పెట్టి పాలు తాగించారు. అయితే పిల్లలు స్కూల్ కి వెళ్ళమని నిద్రపోతామని ఎలాగైతే మారాం చేస్తారో అదేవిధంగా వీరు కూడా మారాం చేయడంతో గెటప్ శీను నిజంగానే తాతయ్య పాత్రలో లీనమై నిజమైన కర్రతో వాళ్ళని చావుదెబ్బలు కొట్టాడు. ముఖ్యంగా పంచ్ ప్రసాద్ పై గెటప్ శీను తన ప్రతాపం చూపిస్తూ స్టేజి మీద తన పరువు మొత్తం తీసేసాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి