
Getup Srinu difficulties NO stood by Sudigali Sudheer
Getup Srinu : తెలుగు బుల్లితెర మీద టాప్ లో ఉన్న కామెడీ షోలలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ఒకటి అని తప్పక చెప్పీలి.. జబర్దస్త్ నుంచి పుట్టుకొచ్చిన ఎక్స్ ట్రా జబర్దస్త్ నుండి కూడా చాలా మంది కమెడీయన్స్ పుట్టుకొచ్చారు. వారిలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్ వంటివారు ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోలో చాలామంది పంచులు వేసి నవ్విస్తే గెటప్ శీను మాత్రం తన గెటప్ తోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అలరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను బుల్లితెర కమలహాసన్ అన్న పేరు కూడా పొందాడు.
పలు కారణాల వలన గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గెటప్ శీను చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలు ఉండగా, ఆ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉండటంవల్ల శీను బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంలోను కనిపించి మెప్పించాడు. అయితే రీసెంట్‌గా గెటప్ శీను కొన్ని కామెంట్స్ చేసి లేని పోని చిక్కుల్లో పడ్డాడు. హనుమాన్ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇండస్ట్రీకి మరో రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేయడంతో జక్కన్న ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు.
Getup Srinu difficulties NO stood by Sudigali Sudheer
అలాంటి అతనిని ప్రశాంత్ వర్మతో పోల్చడమా? ప్రశాంత్ వర్మ గొప్ప డైరెక్టర్ కాదనడం లేదు. కానీ రాజమౌళితో కంపేర్ చేసే అంత గొప్ప డైరెక్టర్ కాదు కదా.. అంటూ గెటప్ శీనుని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ సమయంలో గెటప్ శీను ఫ్రెండ్స్ అయినటువంటి సుడిగాలి సుధీర్ , రాంప్రసాద్ సపోర్ట్‌గా నిలవకపోవడంతో వారిని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. గెటప్ శీను ఏదో పొరపాటున అన్నాడు అని, రాజమౌళిని తక్కువ చేసే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పాలి కదా. మీరు అసలు ఆయన ఫ్రెండ్సేనా అని సుధీర్, రామ్ ప్రసాద్‌ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
This website uses cookies.