Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ ప్రశాంతంగా ఉంటే బిగ్ బాస్ కి నిద్ర పట్టదు కావచ్చు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పెట్టించేందుకు బిగ్ బాస్ తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒకరికి ఇంకొకరికి మధ్య పుల్లలు పెట్టి పక్కకు తప్పుకుంటాడు బిగ్ బాస్. తాజాగా అదే జరిగింది. అమర్ దీప్, శోభా శెట్టి, యావర్.. ఈ ముగ్గురిని మూడో పవరాస్త్ర కోసం కంటెండర్స్ గా సెలెక్ట్ చేసిన బిగ్ బాస్.. ఆ తర్వాత ప్రతి ఒక్క ఇంటి సభ్యుడిని పిలిచి.. ఈ ముగ్గురిలో మూడో పవరాస్త్ర కోసం అర్హత లేని కంటెండర్ ఎవరో చెప్పాలంటూ కన్ఫెషన్ రూమ్ కు పిలిచి మరీ అడుగుతాడు. అదంతా ఓకే కానీ.. అసలు బిగ్ బాస్ వాళ్లు చెప్పిన విషయాలను అందరి ముందు చూపిస్తాడు.
యావర్ అసలు అర్హత లేని వ్యక్తి అని నలుగురు కంటెస్టెంట్స్ చెప్పడంతో యావర్ కు మరో టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో గెలిచి తన సత్తా చాటుతాడు యావర్. ఇక.. శోభా శెట్టి కూడా కంటెండర్ గా అర్హత లేని వ్యక్తి అని ప్రశాంత్, గౌతమ్, శుభశ్రీ చెబుతారు. అయితే.. గౌతమ్ చెప్పిన దానితో శోభాశెట్టి ఏకీభవించదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు అని ఎలా జస్టిఫై చేస్తావు. ఆ రోజు ఫిజికల్ టాస్క్ లో నీకంటే ఎక్కువగా నేనే రింగ్ లో ఉన్నాను. నీకన్నా నేను ఫిజికల్ గా ఫిట్ అంటూ గౌతమ్ తో గొడవ పెట్టుకుంటుంది శోభా శెట్టి.
తను ఫిజికల్ గా ఫైర్ చూపించలేకపోతోంది.. ఐసోలేటెడ్ గా ఉంటోంది అని గౌతమ్ కృష్ణ.. చెప్పడంతో శోభా శెట్టికి కోపం వస్తుంది. స్ట్రాంగ్ కాదు అన్నారు కదా.. కుస్తీ పోటీలో నేను మీకన్నా ఎక్కువ సేపు ఉన్నా అంటుంది. ఐసోలేటెడ్ అంటే నాకు అర్థం కాలేదు అంటూ గౌతమ్ నుంచి క్లారిటీ తెచ్చుకుంటుంది. దీంతో నువ్వు అందరితో కలిసి ఉండటం లేదు.. అంటాడు గౌతమ్. నీతో అసలు నాకు అంత బాండింగ్ లేదు.. నువ్వు మేకప్ వేసుకుంటూ పూజకు లేట్ అయ్యావని అనడం ఏంటి అంటుంది శోభ. దీంతో నీలాగా మేము జిమ్ చేస్తూ టైమ్ పాస్ చేయడం లేదు అనగానే.. నేను జిమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్ అంటూ గౌతమ్ రచ్చ రచ్చ చేస్తాడు. నువ్వు కుస్తీ పోటీలో నా అంత సేపు కూడా లేవు అంటుంది శోభా శెట్టి. దీంతో పుల్ రాజా పుల్ లో తనకు దెబ్బ తాకిందని షర్ట్ విప్పి మరీ చూపిస్తాడు. వామ్మో.. ఏది ఏమైనా.. గౌతమ్ తగ్గలేదు.. శోభా శెట్టి తగ్గలేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా రెచ్చిపోయి మరీ తిట్టుకున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.