Karthika Deepam : మరోసారి కార్తీక్, దీప పెళ్లి.. ఈ విషయం తెలిసి కార్తీక్ ఇంటికి వచ్చి మోనిత ఏం చేసిందో తెలుసా?

Advertisement
Published by
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల కాదు. కార్తీక దీపం సీరియల్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 14 ఫిబ్రవరి 2022, 1275 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ అచ్చం చూడటానికి నాన్నలాగే ఉన్నాడు కదా అని అంటుంది శౌర్య. దీంతో తప్పు అమ్మ అలా అనకూడదు అంటాడు. వీడు కూడా ఇప్పటి నుంచి మన ఇంటి సభ్యుడే అని అంటుంది సౌందర్య. ఇప్పటి నుంచి మేము ఆనంద్ ను తమ్ముడు అనే పిలుస్తాం అంటుంది హిమ. మనమంతా ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది హిమ. దీంతో ఎక్కడికి లేదు.. ఇంట్లోనే మనం గ్రాండ్ పార్టీ చేసుకుంటున్నాం అని చెబుతుంది సౌందర్య. దీంతో ఏం పార్టీ అని అందరూ అడుగుతారు. మీ నాన్న ఫోన్ చేసి అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వమని చెప్పాడు అని కార్తీక్ తో చెబుతుంది సౌందర్య.

Advertisement

grand marriage anniversary of karthika and deepa held at soundarya home

మరోవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి బయటి నుంచి ఓ లుక్కేసుకొని వెళ్తుంది మోనిత. కానీ.. కార్తీక్ వచ్చిన విషయం తనకు తెలియదు. బయటి నుంచి చూస్తే ఏమొస్తది అని అడుగుతుంది భారతి. ఏదో అలా నా ఆనందం అని చెబుతుంది మోనిత. వీళ్లు ఇల్లు ఏంటి లైట్లతో మెరిసిపోతోంది అని అనుకుంటుంది మోనిత. కట్ చేస్తే కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకల కోసం అందరూ రెడీ అవుతుంటారు. పిల్లలు అయితే అమ్మానాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ గ్రీటింగ్ కార్డులను డిజైన్ చేస్తుంటారు. ఇంతలో సౌందర్య వస్తుంది. ఇంతలో డాడీ పెళ్లిని ఘనంగా చేశారు కదా అని అడుగుతుంది హిమ. మాకు మీ డాడీ పెళ్లి చేసే అదృష్టం మాకు దక్కలేదు అని అంటుంది సౌందర్య.

Advertisement

వాళ్లిద్దరూ గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు అంటుంది. అప్పటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక ఇంట్లో నుంచి దీపను బయటికి వెళ్లగొట్టిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య. కాకపోతే.. దీప గొప్పదనాన్ని అర్థం చేసుకున్నాను. దీప కాబట్టి పెద్దోడిని ఓపికగా భరించింది అని అనుకుంటుంది సౌందర్య.

కార్తీక్, దీప.. ఇద్దరినీ పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేస్తారు. అయితే.. వాళ్లకు ఇవాళ తమ పెళ్లి రోజు అనే విషయం కూడా గుర్తు ఉండదు. ఇంటినంతా డెకరేట్ చేయడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మమ్మీ.. ఏంటిది. ఈ హడావుడి ఏంటి అని అడుగుతాడు.

Karthika Deepam : పెళ్లికొడుకు, పెళ్లి కూతురుగా ముస్తాబయిన కార్తీక్, దీప

దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా అని అంటుంది సౌందర్య. దీంతో ఇవాళ మ్యారేజ్ డే కదా మరిచిపోయాను అంటాడు కార్తీక్. అది సరే కానీ.. ఇవన్నీ ఎందుకు మమ్మీ అంటాడు కార్తీక్. నీ పెళ్లిని మేము చూడలేకపోయాం కదా.. అందుకే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం అంటుంది సౌందర్య.

మరోవైపు దీప కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. దీపను చూసి సౌందర్య ముచ్చటపడుతుంది. నన్ను ఈ చీర కట్టుకొని ఈ నగలు అన్నీ ఎందుకు పెట్టుకోమన్నారు అత్తయ్య అంటుంది దీప. దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు దీప అంటుంది సౌందర్య.

పెళ్లి అనేది అందరికీ కలలా ఉండిపోతుంది. కానీ.. నీకు పెళ్లికి ముందు కష్టాలే వచ్చాయి. పెళ్లి తర్వాత కష్టాలే వచ్చాయి. నీ కష్టాలన్నీ ఇంతటితో పోవాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను అని అంటుంది సౌందర్య. దీప మమ్మల్ని ఇంకెప్పుడూ వదిలిపెట్టి వెళ్లమని ఒట్టేసి చెప్పు అంటుంది సౌందర్య.

మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతే మేం ఏం కావాలని అనుకున్నారు. పిల్లలు లేరు. నువ్వు లేవు. ఈ సంతోషాలు లేవు. ఎక్కడుంటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. ఇలా అయితే ఎలా దీప. ప్రతిక్షణం నరకం అనుభవించాం తెలుసా. ఇల్లు వదిలేసి వెళ్దామని పెద్దోడు అంటే నువ్వు కూడా వాడివెంట వెళ్లిపోతే ఎలా అని అడుగుతుంది సౌందర్య.

రాముడి వెంట వెళ్లడం సీత ధర్మం కదా అత్తయ్య అంటుంది దీప. నువ్వు గొప్ప ఇల్లాలువు. నువ్వు పడ్డ కష్టం ఎవ్వరూ పడి ఉండరు. నీకు ఎంత గొప్ప మనసును ఇచ్చాడు. ఎంత ఓపికను ఇచ్చాను. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న నిన్ను ఆ దేవుడు నాకు కోడలుగా ఇచ్చాడు అని అంటుంది సౌందర్య.

ఇంతలో పిల్లలు వచ్చి నానమ్మ అందరూ కింద ఎదురుచూస్తున్నారు పదా అంటారు. తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు. మరోవైపు తాగుబోతు మహేశ్.. అరుణ ఇంటికి వస్తాడు. ఎందుకొచ్చావు అని అడుగుతుంది అరుణ. అదేంటి అక్క.. ఇంటికి చుట్టాలు వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతారా అంటాడు మహేశ్.

నువ్వు మారవురా అని చెప్పి అక్కడి నుంచి మోనిత ఇంటికి వెళ్లబోతూ ఉంటుంది. తననే ఫాలో అవుతాడు. మోనిత ఇంటికి వెళ్లాక అక్కడ మోనితను చూస్తాడు. ఎవరు అని అడుగుతుంది మోనిత. నా తమ్ముడు అమ్మ. తాగుబోతు చచ్చినోడు అని చెబుతుంది అరుణ.

నువ్వు పోరా అంటుంది అరుణ. నమస్తే మేడమ్ అంటాడు మహేశ్. దీంతో చీ పక్కకెళ్లు అంటుంది మోనిత. ఇంతలో ఇంట్లో కార్తీక్ ఫోటోను చూస్తాడు మహేశ్. అక్క ఈ సారు ఫోటో ఇక్కడ ఉందేంటి అని అడుగుతాడు మహేశ్. మరోవైపు కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి.

కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లి చేయిస్తుంది సౌందర్య. ఇంతలో మోనిత అక్కడికి వస్తుంది. వాళ్లను చూసి చప్పట్లు కొడుతుంది. మోనితను చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Vijay Sai Reddy : విజయసాయి రెడ్డి ని బీజేపీలోకి వ‌ద్ద‌న్నారా..?

Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…

1 hour ago

Tax Rules Gold : టాక్స్ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు

Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…

3 hours ago

AP Cabinet : ఏపీ మంత్రివర్గ విస్తరణ పై బిగ్ అప్డేట్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…

4 hours ago

TRS : అన్న వర్సెస్‌ చెల్లి .. టీఆర్ఎస్ టైటిల్ కోసం ఫైట్ .. కానీ ఇక్కడే ఈసీ ​ట్విస్ట్ ..!

TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…

6 hours ago

Ajay Ghosh : అందుకే ఆ రిజెక్ట్‌ చేశా .. ‘సలార్’ సినిమా టీంపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు ..!

Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…

7 hours ago

Cold Water : భోజనం తర్వాత చల్లని నీళ్లు తాగుతున్నారా? .. అయితే ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి ..!

Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…

9 hours ago

Paapam Prathap Movie Review in Telugu : తిరువీర్ ‘పాపం ప్రతాప్’ రివ్యూ అండ్ రేటింగ్

Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…

10 hours ago

Bad Boy Karthik Movie Review : నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రివ్యూ అండ్ రేటింగ్

Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…

11 hours ago

Green Tea vs Black Coffee : గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీ .. వేగంగా బరువు తగ్గడానికి ఏది మేలు ..!

Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…

12 hours ago

Modi : మోడీ కెరీర్ లోనే అతిపెద్ద సెల్ఫ్ గోల్..?

Modi  : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…

22 hours ago

Ys Jagan : రాత్రికి రాత్రి జగన్ సీరియస్ నిర్ణయం..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…

24 hours ago

బ్రేక్ ఈవెన్ అయ్యే పని కాదు? డెకాయిట్ విషయం లో ఎక్కడ తేడా జరిగింది

Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…

1 day ago