
guppedantha manasu 15 august 2022 full episode
Guppedantha Manasu 15 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 529 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, సాక్షి ఎంగేజ్ మెంట్ పనులు ప్రారంభం అవుతాయి. వసుధర దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. రిషిని చూసి వసు బాధపడుతుంది. తనను చూసి రిషి బాధపడతాడు. తనను చూస్తూ మెట్లు దిగుతూ ఉంటుంది వసుధర. ఇంతలో తన కాల్ స్లిప్ అవుతుంది. దీంతో తనను పట్టుకుంటాడు. చేతుల్లో తీసుకెళ్తున్న దండ ఇద్దరి మెడలో పడుతుంది. ఆ తర్వాత దండ తీసుకొని కిందికి వెళ్తుంది వసుధర. మరోవైపు ఎంగేజ్ మెంట్ పనులు జరుగుతూ ఉంటాయి. రిషి, సాక్షి ఇద్దరూ కూర్చొంటారు. సాక్షికి చాలా సంతోషం వేస్తుంది.
guppedantha manasu 15 august 2022 full episode
వెళ్లి బట్టలు మార్చుకొని రండి అని పూజారి పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు చెబుతాడు. దీంతో వసుధర నువ్వు వెళ్లి సాక్షికి హెల్ప్ చేయి అంటుంది దేవయాని. దీంతో నేను వెళ్తాను అత్తయ్య గారు అంటుంది ధరణి. దీంతో చెప్పింది నీకు కాదు కదా.. నువ్వు వెళ్లు వసుధర అంటుంది దేవయాని. మరోవైపు ఇక్కడ ఏం జరుగుతోంది జగతి. అంతా మన చేయి దాటి పోతోంది అని అంటాడు మహీంద్రా. చూశావా జగతి.. ఎంత విచిత్రం.. సాక్షి పెళ్లి కూతురు అయింది. వసుధర చీర కట్టడానికి హెల్ప్ చేస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా జగతి అంటాడు మహీంద్రా. దీంతో నా దగ్గర సమాధానం లేదండి అంటుంది జగతి.
వసుధర.. సాక్షితో పాటు వెళ్తుంది. శారీలో ఉన్న సాక్షి.. ఈ శారీ ఎలా ఉంది, బాగుంది కదా అని అడుగుతుంది. దీంతో బాగుంది అని అంటుంది వసుధర. ఈ శారీ నీకు బాగుంటుందా? లేక నాకు బాగుంటుందా? అని అడుగుతుంది. అవును నువ్వేంటి ఇలా ఉన్నావు. ఏదో పోగొట్టుకున్నదానివిలా అంటుంది.
సారీ సారీ నువ్వు రిషిని పోగొట్టుకుంటున్నావు కదా అని అంటుంది. నువ్వు ఎవరినో చూసుకొని లైఫ్ లో సెటిల్ అయిపో. దేవుడు నీకు తెలివితేటలు బాగానే ఇచ్చాడు కదా. నీ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నవాళ్లే దొరుకుతారులే. నువ్వు గతంలో నన్ను చాలా మాటలు అన్నావు కదా.. అంటుంది సాక్షి.
ఇప్పుడేమంటావు అంటుంది సాక్షి. దీంతో కంగ్రాచ్యులేషన్స్ అంటుంది వసుధర. నీకు అంతకంటే ఎక్కువ ఆప్షన్ ఏం లేదు. నిన్ను చూస్తే గర్వపడాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదు అంటుంది సాక్షి. ఇంతలో తన చీరను సర్దుతుంది వసుధర. అక్కడికి జగతి వస్తుంది. సాక్షి పిలుస్తున్నారు.. వెళ్దాం పదా అని అంటుంది జగతి.
తర్వాత రెడీ అయి వస్తున్న సాక్షిని చేసి రిషి.. వసుధర అనుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దేవుడి దగ్గర దండం పెట్టి కిందికి వస్తారు. రిషి వచ్చి కూర్చొంటాడు. సాక్షి కూర్చోబోతుండగా వసుధర కూర్చో అంటాడు రిషి. దీంతో సాక్షితో పాటు అందరూ షాక్ అవుతారు.
ఆ తర్వాత సాక్షి కూర్చొంటుంది. పూజ మొదలవుతుంది. ఉంగరాలు తీసుకురండి. అబ్బాయి, అమ్మాయి ఉంగరాలు మార్చుకోవాలి. ఆ తర్వాత లగ్నపత్రిక రాస్తాను అంటాడు పూజారి. దీంతో రిషి.. ఉంగరం నీ దగ్గరే ఉంది కదా అని అంటుంది దేవయాని.
రిషి.. సాక్షికి స్వయంగా ఉంగరం ఆర్డర్ ఇచ్చి మరీ చేయించాడు అంటుంది దేవయాని. బాబు ముందుగా నువ్వు అమ్మాయికి ఉంగరం తొడుగు అంటాడు పంతులు. దీంతో ఉంగరాన్ని సాక్షికి తొడగబోతాడు రిషి. కానీ.. ఆ ఉంగరం పెట్టబోతుండగా దాని మీద ఉన్న అక్షరాన్ని చూసి సాక్షి షాక్ అవుతుంది.
ఆ ఉంగరం మీద ఎస్ కు బదులు వీ అని ఉంటుంది. దీంతో వెంటనే తన వేలిని తీసేస్తుంది సాక్షి. రిషి అంటూ కోపంగా అరుస్తుంది. ఏంటిది అంటుంది. దీంతో సాక్షి ఏమైంది అని అడుగుతుంది దేవయాని. ఈ ఉంగరం మీద అక్షరం ఏముందో తెలుసా వీ అని చెబుతుంది సాక్షి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.