Guppedantha Manasu 16 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 635 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అంటుంది దేవయాని. అందుకే నువ్వు నాకోసం ఏదైనా స్పెషల్ చేయి. అది కూడా స్వీట్ కాదు. హాట్ కావాలి అని అంటుంది. దీంతో సరే అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్తుంది ధరణి. వసుధార నువ్వు నా వలలో చిక్కుకున్నావు. ఆవేశపడ్డావు. ఆవేశం ఆలోచనను పక్కదారి పట్టిస్తుంది ఇది నా సగం విజయం వసుధార అని అనుకుంటుంది దేవయాని. ఇంతలో రిషి.. పూల బొకే తీసుకొని ఇంట్లోకి వస్తాడు. పెద్దమ్మ వసుధార ఎక్కడుంది అని అడుగుతాడు రిషి. వసుధార, వసుధార అంటూ పిలుస్తాడు. దీంతో దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకెక్కడి వసుధార రిషి.. వెళ్లిపోయింది కదా అంటుంది దేవయాని. దీంతో రిషి షాక్ అవుతాడు.
వాట్ వెళ్లిపోయిందా.. పెద్దమ్మ.. ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు. దీంతో వెళ్లేవాళ్లు ఎక్కడికి వెళ్తారో చెబుతారా ఏంటి. కాలేజీలో తనను ఎవరో ఏదో అన్నారట. ఆ మాటలకు తన మనసుకు బాధ కలిగిందట. దీంతో ఈ ఇల్లు వద్దు, మీరు వద్దు అని నా ముఖం మీద చెప్పి పోయింది నాన్న అంటుంది. దీంతో అలా ఎలా వెళ్తుంది అని అంటాడు రిషి. కనీసం తనను ఎవరు ఏమన్నారో వివరాలు అయినా చెప్పాలి కదా అంటాడు రిషి. దీంతో అప్పటికీ నేనే అడిగాను కానీ.. నాకు ఏం చెప్పలేదు. చివరకు రిషికి అయినా చెప్పి వెళ్లు అని చెప్పాను. కనీసం నీకు కూడా చెప్పలేదు చూశావా. జగతి గదిలోకి వెళ్లింది. వాళ్లు వాళ్లు ఏదో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత తను.. అంటూ దేవయాని ఏదో చెప్పబోతుండగా అక్కడి నుంచి రిషి జగతి రూమ్ లోకి వెళ్తాడు.
మేడమ్.. వసుధార ఎక్కడికి వెళ్లింది. ఏం జరిగింది మేడమ్. తనేదో ఏడుస్తోందని, ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మ చెప్పారు అంటాడు రిషి. దీంతో అక్కయ్య గారు ఖచ్చితంగా తనకు అనుకూలంగా మార్చుకునే చెప్పి ఉంటారు అని అనుకుంటుంది. తనను ఎవరు ఏమన్నారు చెప్పండి మేడమ్ అని అడుగుతాడు.
దీంతో ఎంతమందికి అని చెబుతావు రిషి. నీ బంధాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. వాళ్లెవరో చెబుతాను. నువ్వు వెళ్లి వాళ్ల మీద అరుస్తావు. కానీ.. ఇది ఇంతటితో ఆగదు కదా. ఇలా అడిగే వాళ్లు పెరుగుతారు. ఎంతమందికి అని సమాధానాలు చెబుతావు. ఒక ఆడ, మగ మధ్య బంధాన్ని సమాధానాలు చెప్పుకునే పరిస్థితి రాకూడదు. సమాధానాలు చెప్పుకునే అవసరం వస్తే అడిగిన వాళ్లందరికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్తే అది బంధమే కాదు రిషి అంటుంది జగతి.
అక్కడి దాకా తెచ్చుకోవద్దు అంటున్నా అంటుంది. దీంతో వసుధార ఎక్కడికెళ్లింది మేడమ్ అని అడుగుతాడు రిషి. ప్రశ్నించే అవసరమే రాకుండా చూసుకో.. అని చెబుతుంది జగతి. వసును అన్నవాళ్లను కాదు.. వసును కన్నవాళ్లను కలుసుకో. నీకు చెప్పకుండా వెళ్లిందని ఆలోచించకు.. తను వెళ్లిన దారిలో నువ్వు వస్తావన్న నమ్మకంతో వెళ్లిందని గుర్తు పెట్టుకో అంటుంది జగతి.
మరోవైపు తన ఇంటికి వెళ్తుంది వసుధార. లాక్ తీసి ఉండటంతో ఎవరు లాక్ తీశారు అని అనుకుంటుంది. ఇంతలో పెద్దమ్మ బయటికి వస్తుంది. నువ్వేంటి పెద్దమ్మ ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దీంతో నీకు గది అద్దెకు ఇచ్చిన దగ్గర్నుంచి.. ఈ గదికి ఎవరెవరో వస్తుంటారు.
అన్ని సోకులు పడతావు అని అంటుంది పెద్దమ్మ. నీ రూమ్ కు ఏనాడైనా ఒక అమ్మాయి వచ్చిందా. రారు ఎందుకు వస్తారు. అబ్బాయిలు వస్తారు. అది కూడా కారులో వస్తారు అని అంటుంది. ఇక ఉండవు.. ఇక్కడ తినవు. మరి ఎందుకు ఇక్కడ ఉండటం. ఈ దరిద్రాన్ని తీసుకుపో అని తన ఇంట్లోని వస్తువులను అన్నింటినీ విసిరిపారేస్తుంది పెద్దమ్మ.
దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో సామాన్లు అన్నీ తీసుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది వసుధార. అక్కడికి కారు వేసుకొని వస్తాడు రిషి. నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలుసు అంటాడు రిషి. ఏం జరిగింది వసుధార అని అడుగుతాడు రిషి.
రూమ్ ఖాళీ చేశావా అని అడుగుతాడు. దీంతో చేయించారు అని అంటుంది. ఎందుకు అంటే.. ఒక్క మాటలో మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను సార్ అంటుంది వసుధార. ఒక అడవిలో జింక ఉంటే.. దాన్ని అందరూ వేటాడేవాళ్లే. దాన్ని పులులు, సింహాలు వేటాడితే తప్పించుకోవడం చాలా కష్టం.
సమాజం అనే ఈ అడవిలో ఆడపిల్లలు చాలామందికి జింకపిల్లల్లా కనిపిస్తారు. మాటలతో వేధిస్తారు. మనసుకు గాయం చేస్తారు. ఎందుకు అని మీరు అడిగారు. ఎందుకు అని నేను ఒక్క కారణం చెప్పలేను. అందుకు చాలా కారణాలు ఉంటాయి అని అంటుంది.
ఆడపిల్ల మాత్రం సమాజం దృష్టిలో అలాగే ఉంది సార్. ప్రతి సారి మీ ఇంటికి వచ్చి కూర్చొంటే.. చాలామందికి చాలా డౌట్లు వస్తాయి సార్. ఏ అర్హతతో ఇక్కడికి వస్తున్నావు అనే ప్రశ్నలకు నాదగ్గర సమాధానం లేదు సార్ అంటుంది వసుధార. నేను మా ఊరు వెళ్లిపోతాను సార్ అని అంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.