Guppedantha Manasu 18 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జనవరి 2023, బుధవారం ఎపిసోడ్ 663 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను చూసి షాక్ అవుతారు జగతి, మహీంద్రా. రిషి సార్ ఎక్కడ అని అడుగుతుంది వసుధార. ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీ ఎండీ ఎవరో తెలుసా? జగతి. రిషి కాదు అంటాడు మహీంద్రా. రిషి లేడు. ఎక్కడికో వెళ్లిపోయాడు అంటుంది జగతి. ఎక్కడికి వెళ్లాడో తెలియదు అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. మళ్లీ ఎందుకు వచ్చావమ్మా అంటారు. నువ్వు అప్పటి వసుధారవు కాదు మేడమ్. కొత్త వసుధారవు అంటాడు మహీంద్రా. దీంతో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అంటుంది వసుధార. దీంతో నువ్వు అప్పటి వసువు కాదు కదా. ఎవరి ఇష్టాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. అంటూ జగతి కూడా సీరియస్ గా మాట్లాడుతుంది. దీంతో సరే మేడమ్ నేను నా క్యాబిన్ కు వెళ్తాను అంటుంది.
దీంతో మళ్లీ నువ్వు రావడం అవసరమా? ఎన్నాళ్లు ఇలా సమాధానం చెప్పకుండా ఉంటావు అని అడుగుతుంది జగతి. దీంతో నేను చెప్పాల్సిన సమాధానాలు చెప్పాల్సిన సమయం వచ్చిన.. చెప్పాల్సిన వాళ్లకే చెబుతాను అంటుంది వసుధార. మరోవైపు కారులో వెళ్తూ వసుధార మళ్లీ ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు రిషి. తననే మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా పెట్టి చైర్ లో కూర్చోబెట్టిన విషయం ఆ చైర్ ను చూడగానే గుర్తొస్తుంది వసుధారకు. అసలు సార్.. నేను పిలుస్తున్నా ఎందుకు ఆగకుండా వెళ్లారు. మా జెంటిల్ మెన్ కు కోపం వచ్చినట్టుంది. ఆ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు కదా. ఆ కోపాన్ని తగ్గించేందుకు వచ్చాను నేను అని అనుకుంటుంది. వెంటనే రిషికి ఫోన్ చేస్తుంది కానీ.. రిషి ఫోన్ ను కట్ చేస్తాడు. దీంతో మళ్లీ చేస్తుంది వసుధార.
మళ్లీ కట్ చేస్తాడు రిషి. దీంతో ఏం చేయాలో వసుకు అర్థం కాదు. సార్ నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నానంటే దానికి జగతి మేడమ్, మీరే సార్ కారణం. యూత్ ఐకాన్ గా నిలిచినా.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచినా అంతా మీవల్లే అనుకుంటుంది. ఇంతలో జగతి, మహీంద్రా వస్తారు.
అసలు నువ్వు ఎందుకు వచ్చావు. జరిగిందంతా మరిచిపోయి ఇప్పుడు సడెన్ గా మిషన్ ఎడ్యుకేషన్ అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చేశావో తెలుసా? రిషిని నిలువునా మోసం చేశావు. రిషి ఎలా ఉన్నాడో తెలుసా? అంటుంది జగతి. దీంతో వసుధార ఏం మాట్లాడదు.
ఏం మాట్లాడవు ఏంటి వసుధార అంటే.. అన్నింటికీ సమాధానాలు నేను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతా అంటుంది వసుధార. జరిగిన దాని గురించి వదిలేసి.. జరగాల్సిన దాని గురించి మనందరం కలిసి మాట్లాడుకుంటే మంచిది అంటుంది. దీంతో జగతికి కోపం వస్తుంది.
వసుధారను కొట్టబోతుంది కానీ.. మహీంద్రా ఆపుతాడు. నిజం చెప్పు.. రిషిని ఎందుకు మోసం చేశావు. రిషి గురించి ఆలోచించకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే రిషి ఏమౌతాడు.. రిషి పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించలేదా అంటుంది జగతి.
దీంతో మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను కానీ.. దానికి టైమ్ ఉంది మేడమ్ అంటుంది వసుధార. దీంతో ఒక మనిషిని చంపి పాతిపెట్టి దాని మీద గులాబి మొక్క నాటినట్టు మాట్లాడుతున్నావు అంటుంది జగతి. చిన్నవాళ్లకు దండం పెట్టొద్దు అంటున్నారు.
అయినా దండం పెట్టి అడుగుతున్నాను వసుధార. ఏం సాధిద్దామని మళ్లీ కాలేజీకి వచ్చావు అని అడుగుతాడు మహీంద్రా. చాలా గొప్పదానివి వసు. మనుషుల గుండెల్లో కత్తులు దించి పేపర్ మీద సారీ రాస్తే సరిపోతుందా? ఈ సారీలు రిషిని తీసుకురాగలవా?
సారీ అంటే చేసిన తప్పులు ఒప్పు అవుతాయా? నా కొడుకును బాధపెట్టే హక్కు నీకెక్కడిది. నువ్వు సంతోషంగానే ఉన్నావు. రిషినే దూరంగా వెళ్లిపోయాడు అని అంటుంది. దీంతో రిషి సార్ ఎక్కడికి వెళ్లారు మేడమ్ అంటే ఎక్కడికి వెళ్తే నీకెందుకు. చేయాల్సిందంతా చేశావు కదా అంటుంది జగతి.
నాకొడుకుకు 20 ఏళ్లు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వొచ్చి మళ్లీ దూరం చేశావు. నీకన్నా ఆ దేవయాని అక్కయ్యే నయం. ద్వేషించినా రిషి బాగోగులు చూస్తుంది. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటుంది. గురు దక్షిణ ఇస్తా అన్నావు కదా. చాలా గొప్పగా గురు దక్షిణ ఇచ్చావు వసుధార అని మహీంద్రా అంటాడు.
రిషి సార్ ఎక్కడికి వెళ్లారు అని మళ్లీ అడుగుతుంది వసుధార. దీంతో రిషి లేడు.. రాడు.. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. మాకు తెలిసినా నీకు చెప్పం అంటుంది వసుధార. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ కాలేజీ నాకు జీవితాన్ని ఇచ్చింది అని అనుకుంటుంది.
ఇంతలో పుష్ప వస్తుంది. వసుధారతో మాట్లాడుతుంది. సరే వసు నన్నెందుకు రమ్మన్నావు అంటుంది. దీంతో నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటుంది. ఇక్కడ ఉండటానికి నాకు ఒక ఇల్లు కావాలి అంటుంది. దీంతో హాస్టల్ లో ఉండొచ్చు కదా.. అంటే ఫ్యామిలీతో ఉండటానికి ఇల్లు కావాలి అంటుంది.
కట్ చేస్తే వసుధార.. రిషి ఇంటికి వస్తుంది. రిషి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. దీంతో దేవయాని ఏయ్ ఆగు. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఇదేదో నీ సొంత అత్తవారిల్లు అన్నట్టుగా లోపలికి వచ్చావు అంటుంది. దీంతో రిషి సార్ తో మాట్లాడాలి అంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.