Guppedantha Manasu 22 Aug Today Episode : వసుధర తన ప్రేమను రిషికి చెప్పేస్తుందా? రిషి తన ప్రేమను రిజెక్ట్ చేస్తాడా? వసు ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Advertisement
Advertisement

Guppedantha Manasu 22 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 535 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాక్షి కోసం రిషి చేయించిన రింగ్ ను తీసుకున్న వసుధర.. తన మెడలో కట్టుకుంటుంది. ఇంతలో సడెన్ గా రిషి తన ఇంటికి వస్తాడు. తను రాగానే చూసి షాక్ అవుతుంది వసుధర. ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది. ఏం రాకూడదా అంటాడు. తన మెడలో కట్టిన దారం కనిపిస్తుంది రిషికి. ఏంటా దారం అని అడుగుతాడు రిషి. దీంతో ఏం లేదు అని అంటుంది వసుధర. సరే నేను ఎందుకు వచ్చానంటే అని చెప్పి ఒక బుక్ తీయబోతాడు. అందులో తను వీఆర్ అని రాసుకుంటుంది. అందుకే ఆ నోట్ బుక్ ను లాగేస్తుంది. దీంతో ఇంకో బుక్ తీసి అందులో ఏదో రాయబోతాడు రిషి.

Advertisement

guppedantha manasu 22 august 2022 full episode

చూడు వసుధర.. ఈ సబ్జెక్ట్ లో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. నేను మార్క్ చేసినవి నువ్వు ఈరోజే చదివేయాలి. నువ్వు నేర్చుకోగానే రేపు నాకు అప్పజెప్పాలి. సరేనా.. అని అంటాడు రిషి. నీ లక్ష్యం ఏంటో అనుక్షణం నీకు గుర్తుకు రావాలి.. అంటాడు రిషి. దీంతో సరే సార్ అంటుంది వసుధర. ఇంతలో తన చేయిని తీసుకుంటాడు రిషి. తన చేతిలో డబ్బు పెడతాడు. డబ్బును చూసి వసుధర షాక్ అవుతుంది. సార్ ఏంటిది అని అంటుంది వసుధర. దీంతో డబ్బు అవసరం ఉందని అడ్వాన్స్ అడిగావట కదా. డబ్బు ఎందుకు అని నేను అడగడం బాగుండదు కానీ.. నీకు ఇంకెప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను అడుగు. ఎవ్వరినీ అడగొద్దు. ఈ క్యాష్ మేనేజర్ కు ఇచ్చేయ్. చదువు మీద దృష్టి పెట్టు. అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోయాక.. ఆ రింగును చూసుకొని మురిసిపోతుంది వసుధర.

Advertisement

మరోవైపు ఇంటికి వెళ్లాక కూడా వసుధర గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. కాఫీ తాగుతూ వసుధర ఏం చేస్తూ ఉంటుంది. తనకు ఫోన్ చేద్దాం అని అనుకుంటాడు రిషి. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. హాయ్ రా. ఏంటి సంగతి అని అంటాడు. ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది.

తన ఫోన్ లో పొగరు అనే పేరుతో ఫోన్ వస్తుంది. అది వసుధర ఫోన్. దీంతో వసుధర ఫోన్ ఎత్తి.. ఏం చేస్తున్నావు. కాఫీ తాగావా? వసుధర చెప్పు అంటాడు. నువ్వు ఎక్కడున్నావు అని అంటాడు. దీంతో మీ ఇంటికి వచ్చాను అంటుంది అన్నట్టుగా మాట్లాడుతాడు.

దీంతో వెంటనే హాల్ కు పరిగెడతాడు రిషి. వసుధరను చూసి ధరణి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. దీంతో ఇప్పుడే అంటుంది వసుధర. దీంతో సరే కూర్చో కాఫీ తెచ్చిఇస్తాను అంటుంది ధరణి. ఇంతలో దేవయాని ఇక్కడికి వచ్చి ఏంటి ధరణి.. వచ్చిన వాళ్లకు కాఫీ,టీలు ఇవ్వడమే నీ పనా. ఆమె కాలేజీ స్టూడెంట్. లోపలికి వెళ్లు అంటుంది దేవయాని.

Guppedantha Manasu 22 Aug Today Episode : రిషి సార్ ఇంటికి వెళ్లిన వసుకు షాకిచ్చిన దేవయాని

ఏంటి పొద్దున్నే వచ్చేశావు అని అంటుంది దేవయాని. దీంతో రిషి సార్ ఆర్డర్ అంటుంది. ఇంత పొద్దున ఎందుకు పిలిచాడు అంటుంది. ఏదైనా ఉంటే కాలేజీలో చూసుకోండి అంటుంది దేవయాని. సరే మేడమ్ అదే విషయాన్ని నేను అడుగుతా అంటుంది.

దీంతో మీ విషయంలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు అంటుంది దేవయాని. ఇంతలో రిషి వస్తాడు. దీంతో దేవయాని వెళ్లిపోతుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. దీంతో మీరే కదా రమ్మన్నారు. రాత్రి మార్క్ చేసి ఇచ్చినవి నేను చదువుకొని వచ్చాను అంటుంది.

అయితే.. ఇంకాసేపట్లో కాలేజీలో కలుస్తాం కదా. అక్కడ చెప్పొచ్చు కదా అంటాడు. ఇంతలో గౌతమ్ వస్తాడు. హాయ్ వసుధర అంటాడు. మేమిద్దరం ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. నువ్వెందుకు ఇక్కడ అంటాడు. దీంతో గౌతమ్ వెళ్లిపోతాడు. వసుధర కాలేజీలో కలుద్దాం. నువ్వు వెళ్లు అంటాడు రిషి. దీంతో సరే అంటుంది వసుధర.

ఏంట్రా మాట్లాడుతా అన్నావు. అప్పుడే పంపించేశావు ఏంటి అని గౌతమ్ వచ్చి అడుగుతాడు. దీంతో మాట్లాడటం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు రిషి గురించే ఆలోచిస్తూ ఉంటారు మహీంద్రా, జగతి. వీడు ఎప్పటికీ మనకు అర్థం కాడు అంటాడు.

ఇంతలో గౌతమ్ వచ్చి మనం వాడి గురించి బాధపడుతున్నాం. కానీ.. వాడికి అస్సలు బాధేలేదు అంటాడు గౌతమ్. పొద్దున్నే వసుధర వచ్చింది కదా.. తనతో ఏం మాట్లాడుకుండానే పంపించేశాడు అంటాడు గౌతమ్. వసు ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది జగతి. దీంతో అవును మేడమ్ అంటాడు గౌతమ్.

తను ఇంటికి వచ్చి నన్ను కలవకుండా వెళ్లడం ఏంటి అని అనుకుంటుంది జగతి. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంది వసుధర. ఇంతలో జగతి.. వసుకు ఫోన్ చేస్తుంది. నువ్వు ఇంటికి వచ్చావా. నన్ను కలవకుండా వెళ్లిపోయావు ఏంటి అని అడుగుతుంది.

దీంతో నేను ఎలా వచ్చానో.. అలాగే వెళ్లిపోవాలని మీ అబ్బాయి అన్నాడు అంటుంది వసు. కట్ చేస్తే వసును కలుస్తుంది సాక్షి. రిషి చేయించిన ఆ ఉంగరం ఏంది అని అడుగుతుంది సాక్షి. దీంతో రిషి సార్ నే నువ్వు వద్దనుకున్నావు. ఇంకా రింగ్ గురించి నీకెందుకు అంటుంది వసుధర.

రిషి సార్ గురించి మాట్లాడే అర్హత నీకు ఈరోజే కాదు.. ఏరోజూ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధర. కట్ చేస్తే కాలేజీకి వెళ్తుంది వసుధర. ఇంతలో రిషి కారు కనిపిస్తుంది. ఆ కారు దగ్గరికి వెళ్లి.. అసలు ఏంటి మీ ఉద్దేశం. మీరు చెప్పింది అంతా నేను వింటాను. కానీ.. మీరు మాత్రం నేను చెప్పేది వినరా అని కారుతో మాట్లాడుతుంది వసు.

నేను ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పనివ్వరు. మీరు అర్థం చేసుకోరు. మీతో ఎలా.. అస్సలు మీ పద్ధతి బాగోలేదు అంటుంది. కారు వెనుక నుంచి అన్నీ రిషి వింటాడు. ఏమైంది వసుధరకు తనకు తానే మాట్లాడుకుంటోంది ఏంటి అని అనుకుంటాడు.

నేను మీ మీద అలిగాను అని అంటుంది వసుధర. అస్సలు మీరు గానీ నా ఎదురుగా కనిపిస్తే మామూలుగా ఉండదు. టపా టపా అని ప్రశ్నలు అడిగేస్తాను అంటుంది. అసలు నేను ఏం మాట్లాడుతానో, ఏం అడుగుతానో నాకే తెలియదు అంటూ ఏదేదో వాగుతుంది వసుధర.

ఇంతలో రిషి.. తనకు కనిపిస్తాడు. రిషిని చూసి షాక్ అవుతుంది వసుధర. ఆ తర్వాత కాలేజీలో గౌతమ్ రిషిని కలుస్తాడు. అసలు వసుధర గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. తను నిన్ను ప్రేమిస్తోంది అంటాడు. ఇవన్నీ వసుధర వింటుంది. ఆ తర్వాత రిషిని నా నుంచి దూరం చేయకు అని అమ్మోరుకు మొక్కుకుంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

15 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.