Home » Entertainment » Guppedantha Manasu 23 August 2022 Full Episode
Entertainment

Guppedantha Manasu 23 Aug Today Episode : ఎగ్జామ్స్ అయిపోగానే రిషిని వదిలి వెళ్లిపోబోతున్న వసుధర.. ఇక ఇద్దరూ కలవరా? వసు పరిస్థితి ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Updated on: August 23, 2022, 10:09 am
Advertisement

Guppedantha Manasu 23 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 536 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసు కారుతో మాట్లాడే మాటలన్నీ వింటాడు రిషి. సార్ మీరా అంటుంది. మీరేంటి సార్ ఇక్కడ అంటుంది. దీంతో కారు నాదే కదా. నా కారు దగ్గర నేను నిలుచనున్నాను అంటాడు రిషి. దీంతో మీ కారు అయితే దాని వెనుక ఎందుకు నిలుచున్నారు అని అడుగుతుంది. దీంతో మీరు అన్నీ విన్నారా అని అంటుంది. దీంతో నాకు వినికిడి శక్తి బాగానే ఉంది. అన్నీ వినబడ్డాయి అంటాడు. ఏం విన్నారు అంటుంది వసు. దీంతో అన్నీ విన్నాను. ముందుకు వస్తే ఏదో అడుగుతా అన్నావు కదా అని అడుగుతాడు రిషి. దీంతో అదేం లేదు సార్ అంటుంది. నాకు క్లాస్ కు టైమ్ అవుతోంది. నేను వెళ్తా అంటుంది వసు. దీంతో ముందు నువ్వు నిన్న రాసిన నోట్స్ ఇవ్వు అంటాడు. దాన్ని తీసుకొని వెళ్తాడు.

Advertisement

guppedantha manasu 23 august 2022 full episode

మరోవైపు మీటింగ్ కు అటెండ్ అవుతారు అందరూ. జగతి మేడమ్ ఎక్స్ ట్రా క్లాసెస్ పెడదామా అని అడుగుతుంది మరో మేడమ్. దీంతో వద్దు.. అంటుంది జగతి మేడమ్. ఇంతలో రిషి వస్తాడు. రిషి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి.. ఇన్విజిలేషన్, ప్రిపరేషన్ అన్నీ రెడీగా ఉన్నాయి అంటుంది జగతి. ఇంతలో సార్ ఎక్స్ ట్రా క్లాసులు పెట్టిద్దామా అని అడుగుతుంది ఓ మేడమ్. దీంతో ఎక్స్ ట్రా క్లాస్ లు పెడితే ఎక్కువ మార్కులు వస్తాయనేది తప్పు. వాళ్లకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటాడు రిషి. వాళ్ల బుర్రల్లో ఉండే టెన్షన్ ను ఫ్రీ చేయాలి. అందుకోసం డీబీఎస్ టీ కాలేజీ ఆనవాయితీ ప్రకారం మంచి ఫేర్ వెల్ అరేంజ్ చేయాలి అంటాడు.

Advertisement

ఫేర్ వెర్ పార్టీలో వాళ్లకు ఉత్సాహం వచ్చేలా వాళ్లకు మోటివేషనల్ క్లాస్ లు అరేంజ్ చేద్దాం. పార్టీ అంటే హంగులు, హడావుడి కాకుండా సింపుల్ గా చేద్దాం అంటాడు రిషి. దీంతో సరే రిషి అంటుంది జగతి మేడమ్. ఈ విషయం నోటీస్ బోర్డ్ లో పెట్టండి. స్టూడెంట్స్ కూడా రెడీ అవుతారు.

పెదనాన్న నన్ను నమ్మండి. ఈ ఫేర్ వెర్ పార్టీతో స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారు. ఎగ్జామ్స్ కు వెళ్లే స్టూడెంట్స్ మైండ్ లో నుంచి ఒత్తిడిని తీసేయడమే ఈ ఫేర్ వెర్ పార్టీ ఉద్దేశం అని అందరూ తెలుసుకోండి అని చెప్పి మీటింగ్ అయిపోయింది అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

Advertisement

Guppedantha Manasu 23 Aug Today Episode : రిషితో మాట్లాడిన గౌతమ్

కాలేజీ అయిపోతే ఇక స్టూడెంట్స్ అంతా వెళ్లిపోతారు అని మహీంద్రాతో అంటుంది జగతి. వసుధర కూడా వెళ్లిపోతుంది అంటుంది జగతి. మరోవైపు గౌతమ్.. రిషితో మాట్లాడటానికి వెళ్తాడు. వసుధర నిన్ను ప్రేమిస్తోంది కదా. అది నిజమే కదా అంటాడు గౌతమ్.

దీంతో ఆ టాపిక్ ఇప్పుడు అవసరం లేదు. నువ్వు వెళ్లొచ్చు అంటాడు రిషి. నీతో ఇదే ప్రాబ్లమ్. నీ మనసులో ఏముంది చెప్పు అంటాడు గౌతమ్. ఒకసారి ఏదో జరిగిందని బిగుసుకుపోతావా? తనతో నన్ను మాట్లాడమంటావా అని అడుగుతాడు గౌతమ్. దీంతో దానంతట అదే పరిష్కారం అవుతుంది అంటాడు రిషి.

ఎగ్జామ్స్ అయిపోయాక వసుధర ఎటో.. నువ్వు ఎటో.. మీరిద్దరు కూడా విడిపోబోతున్నారు అని అంటాడు గౌతమ్. గౌతమ్.. రిషితో మాట్లాడుతున్న విషయాలన్నీ వింటుంది వసుధర. వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి నన్ను, రిషిని విడదీయకు దేవుడా అని వేడుకుంటుంది వసుధర.

దీంతో అప్పుడే మహీంద్రా తన దగ్గరికి వస్తాడు. వసుకు ధైర్యం చెబుతాడు. రిషి మనసు మారుతుందేమో వెయిట్ చేసి చూద్దాం అని తనకు భరోసా ఇస్తాడు మహీంద్రా. మరోవైపు రిషి కూడా గౌతమ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు కావాలనుకున్న వసుధర ఎందుకు దగ్గరవడం లేదు. వసుధరే నా అంతిమ గమ్యమా? నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉందా అని అనుకుంటాడు రిషి. నా వైపు నుంచి తప్పు ఉంది కానీ.. దాన్ని నేను సరిదిద్దుకుంటాను అని అనుకుంటుంది వసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి