Guppedantha Manasu 24 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 537 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది వసుధర. ఏం చేస్తున్నారు సార్ అని అనుకుంటుంది. మరోవైపు రిషి రెడీ అవుతుంటాడు. ఇంతలో తనకు కర్చీఫ్ కనిపిస్తుంది. అది వసుధర ఇచ్చిన కర్చీఫ్. నువ్వు నన్ను ప్రతిక్షణం వెంటాడే బంధానివా.. అని అనుకుంటాడు. మరోవైపు ఆ రింగ్ మీద వీఆర్ అని రాయిస్తుంది వసు. ఆ రింగ్ ను చూసి మురిసిపోతుంది వసుధర. క్యాలెండర్ దగ్గరికి వెళ్లి క్యాలెండర్ మీద 24 వ తారీఖును రౌండప్ చేసి డీబీఎస్టీ కాలేజీ ఫేర్ వెల్ పార్టీ అని రాస్తాడు. ఫేర్ వెల్ ఎవరికి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కా.. వసుధరతో నా పరిచయానికా అని అనుకుంటాడు. ఇంతలో మహీంద్రా, జగతి ఇద్దరూ రెడీ అవుతారు.
జగతి ఫేర్ వెల్ పార్టీకి మినిస్టర్ గారిని కూడా పిలిస్తే బాగుంటుంది కదా అని అంటాడు మహీంద్రా. దీంతో మినిస్టర్ గారు ఊళ్లో లేరు అంటుంది జగతి. ఇంతలో దేవయాని విని ఏంటి మహీంద్రా ఫేర్ వెర్ పార్టీ గ్రాండ్ గా చేస్తున్నారా అని అడుగుతుంది. దీంతో అదేం లేదు వదిన.. ఏదో మామూలుగా చేస్తున్నాం అంటాడు మహీంద్రా. ఫేర్ వెల్ పార్టీ కోసం ఇంట్లో స్వీట్స్ చేయించాను అంటుంది దేవయాని. ధరణి.. ఆ స్వీట్స్ తీసుకురా అంటుంది దేవయాని. స్వీట్స్ తెమ్మంటారా అని అడుగుతుంది ధరణి. వద్దులే ధరణి.. అంటుంది జగతి. చేతుల్లో స్వీట్స్ పెట్టుకొని మనసులో విషం పెట్టుకుంటే బాగుండదు అంటుంది జగతి.
ఏంటి జగతి మనసులో విషం ఏంటి.. ఇప్పుడు రిషి నిన్ను అమ్మ అని పిలవాలని అనుకుంటాడు. నేనూ కోరుకుంటున్నాను కానీ.. నిన్ను మేడమ్ అంటాడు. నువ్వు కనీసం రిషిని పేరు పెట్టి కూడా పిలవలేవు. సార్ అంటావు. ఇన్ని పెట్టుకొని మళ్లీ నాకే ప్రవచనాలు చెప్పడానికి చూస్తున్నావు చూడు.. నవ్వొస్తుంది జగతి అంటుంది దేవయాని.
ఇంతలో రిషి కిందికి దిగి వస్తాడు. దీంతో అతడికి రిషి అని పేరు పెట్టి పిలిచి కాఫీ ఇస్తుంది. రిషి అని పేరు పెట్టి పిలిచే సరికి ధరణి, దేవయాని షాక్ అవుతారు. ఇప్పుడు చూడు.. ఆ కాఫీ కప్పును విసిరికొడతాడు అని అనుకుంటుంది దేవయాని. కానీ.. రిషి మాత్రం ఆ కాఫీ తాగుతాడు. కావాలని చాలా సార్లు రిషి రిషి అంటూ మాట్లాడుతుంది జగతి.
దీంతో దేవయాని షాక్ అవుతుంది. అది సంగతి అక్కయ్య గారు. మరి నేను కాలేజీకి వెళ్లిరానా. ధరణి.. అక్కయ్య గారికి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు. ఇప్పుడు తనకు అది చాలా అవసరం. మహీంద్రా వెళ్దామా.. పదా అని అంటుంది జగతి. కట్ చేస్తే అందరూ కాలేజీకి వెళ్తారు.
నోటీసు బోర్డు మీద ఫేర్ వెల్ పార్టీ ఉందని పెడతారు. స్టూడెంట్స్ దాన్ని చూసి ఎగిరి గంతేస్తారు. మరోవైపు ఫేర్ వెల్ పార్టీ కోసం రిషి, గౌతమ్, స్టూడెంట్స్ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో వసుధర వస్తుంది. రిషి సార్.. ఈ ఫేర్ వెల్ పార్టీలో నాకు కూడా ఏదైనా వర్క్ చెప్పండి సార్ అంటుంది వసు.
దీంతో ఈరోజు ఫేర్ వెల్ పార్టీ ఫైనల్ ఇయర్ వాళ్లకు. వాళ్లంతా మాకు ఇవాళ అతిథులు కాబట్టి వాళ్లకు ఏపని చెప్పం అంటాడు రిషి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక రిషి, వసు ఇద్దరూ మాట్లాడుతుండగా తన పెదనాన్న వస్తాడు. రా. అర్జెంట్ పని ఉంది రా అంటాడు.
దీంతో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్తాడురిషి. మరోవైపు ఫేర్ వెల్ పార్టీ స్టార్ట్ అవుతుంది. రిషి మాట్లాడుతాడు. ఫేర్ వెల్ పార్టీ చేసుకోవడం ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు మనసులో ఏదో మూల చిన్న బాధ అంటాడు. డీబీఎస్టీ కాలేజీలో ప్రతి స్టూడెంట్ ఒక అద్భుతం.
డీబీఎస్టీ కాలేజే ఒక అద్భుతం అంటాడు రిషి. రేపు ఎగ్జామ్స్ కోసం కష్టపడండి. ఇష్టంగా కష్టపడండి. రేపటి సమాజాన్ని నిర్మించేది మీరే. మీ కలలను నిజం చేసుకోండి.. జీవితంలో మీరు ఎదగడం గొప్పే. ఇతరులకు సహాయపడేలా ఎదగడం ఆదర్శం అవుతుంది అంటాడు.
మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు రిషి. ఆ తర్వాత జగతి మాట్లాడుతుంది. అత్తవారింటికి వెళ్లేటప్పుడు అప్పగింతలు పెట్టినట్టుగా నాకు అనిపిస్తోంది అంటుంది జగతి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడాలని అనుకుంటే మాట్లాడొచ్చు అంటుంది జగతి.
దీంతో వసుధర అని అందరూ అరుస్తారు. దీంతో వసు రా అని పిలుస్తుంది జగతి. దీంతో వసుధర స్టేజి మీదికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.