Guppedantha Manasu 25 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 617 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి అని అనుకుంటాడు గౌతమ్. డాక్టర్ ను అడుగుతాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఆవిడకు చాలా సివియర్ గా దెబ్బలు తగిలాయి అని చెబుతాడు డాక్టర్. చాలా బ్లడ్ పోయింది. వెంటనే బ్లడ్ కావాలి అంటాడు. రేర్ గ్రూప్. దొరకడం చాలా కష్టం అంటాడు. మన హాస్పిటల్ లో కూడా లేదు. వెంటనే తీసుకురండి అంటాడు. దీంతో సరే అంటాడు. అంకుల్ పరిస్థితి ఏంటి అంటే.. ఆయనకు ఎలాంటి సమస్య లేదు అంటాడు డాక్టర్. వసుధారకు అయినా ఫోన్ చేద్దాం అని అనుకుంటాడు గౌతమ్. మరోవైపు మహీంద్రా ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు రిషి. డాడ్ రావద్దనే నిర్ణయించుకున్నారా అని వసుధారతో అంటాడు రిషి. దీంతో లేదు సార్.. మహీంద్రా సార్ ఎప్పుడూ అలా అనుకోరు అంటుంది వసుధార. క్షణక్షణానికి నా గుండె బరువెక్కుతోంది వసుధార అంటాడు.
ఇంతలో గౌతమ్.. వసుధారకు ఫోన్ చేస్తాడు. డాడ్ ఏమో అనుకొని రిషి… తన ఫోన్ తీసుకుంటాడు. కానీ చూస్తే గౌతమ్. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు.. ఏంట్రా అంటాడు. దీంతో నువ్వు ఒకసారి హాస్పిటల్ కు రా అంటాడు. దీంతో షాక్ అవుతాడు రిషి. హాస్పిటల్ కు ఎందుకు అంటాడు. నేను రాను డాడ్ వస్తాడు ఇప్పుడు అంటాడు. అదికాదురా.. ఒక్కసారి నువ్వు హాస్పిటల్ కు రా అంటాడు. దీంతో ఏం చేయాలో రిషికి అర్థం కాదు. అసలు గౌతమ్ ఇన్ని సార్లు నా ఫోన్ కు ఎందుకు కాల్ చేశాడు. అంత అర్జెంట్ ఏముంది అని అనుకుంటాడు రిషి. దీంతో వెళ్దాం పదండి సార్.. అలా వెళ్లి ఇలా వద్దాం అంటుంది వసుధార. దీంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి బయలుదేరుతారు.
ఏమైంది వసుధార.. అర్జెంట్ గా హాస్పిటల్ కు రమ్మంటాడు.. అడిగితే వివరాలు చెప్పడు అంటూ చిరాకు పడతాడు రిషి. గౌతమ్ సార్ అర్జెంట్ గా రమ్మన్నారు అంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది అంటుంది వసుధార. డాడ్ వచ్చేటప్పటికి నేను డాడ్ ఎదురుగా ఉండాలి. నేను డాడ్ ను స్వాగతించాలి. నాకోసం డాడ్ ఎదురు చూడకూడదు. నేను డాడ్ కోసం ఎదురు చూడాలి కదా అంటాడు రిషి.
ఇంతలో ఆసుపత్రి వస్తుంది. కారు దిగి హాస్పిటల్ లోపలికి వెళ్తారు రిషి, వసుధార. ఏంటి వసుధార.. ఈ గౌతమ్ ఏం చెప్పకుండా రమ్మన్నాడు అని అంటాడు. అసలు వాడు ఎందుకు రమ్మన్నాడో.. వాడు కనిపించనీ.. వాడి సంగతి చెబుతాను. ఒకసారి గౌతమ్ కు కాల్ చేయ్ అంటాడు రిషి.
దీంతో కాల్ చేస్తుంది వసుధార. అర్జెంట్ గా ఐసీయూ దగ్గరికి రమ్మంటాడు గౌతమ్. వెంటనే అక్కడికి వెళ్తారు రిషి, వసుధార. ఓ నెగెటివ్ బ్లడ్ కోసం చాలామందికి ఫోన్ చేస్తాడు గౌతమ్. ఎవ్వరి దగ్గర లేదంటారు. గౌతమ్ దగ్గరికి నీకేమైనా అయిందా.. ఎందుకు రమ్మన్నావు అని అంటాడు రిషి.
దీంతో అంకుల్ వాళ్లకు.. అంటూ చెప్పలేకపోతాడు గౌతమ్. అది… అది అంటాడు. డాడ్ వాళ్లకు ఏమైంది చెప్పు అంటాడు రిషి. దీంతో ఐసీయూ డోర్ నుంచి మహీంద్రాను చూపిస్తాడు గౌతమ్. మహీంద్రాను చూసి రిషి, వసుధార షాక్ అవుతారు. డాడ్ కు ఏమైందిరా.. ఆ కట్లు ఏంటి అని అడుగుతాడు.
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డాడ్ మీకు ఏమైంది అని అడుగుతాడు రిషి. సారీ రిషి. మీ దగ్గరికి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది అంటాడు మహీంద్రా. మీరు నా దగ్గరికి వస్తున్నారా అంటాడు. అవును రిషి.. నిన్ను వదిలి అన్ని రోజులు ఎలా ఉన్నానో నాకు అర్థం కావడం లేదు. నిన్ను బాధపెట్టినందుకే దేవుడు నన్ను అలా శిక్షించాడేమో అంటాడు.
దీంతో డాడ్ అలా మాట్లాడకండి.. మీకేం కాదు అంటాడు. సార్.. మేడమ్ ఎక్కడ అని అడుగుతుంది వసుధార. దీంతో పక్కన ఉందని చెబుతాడు. తనను చూసి వసుధార షాక్ అవుతుంది. మేడమ్ కళ్లు తెరవండి మేడమ్ అంటుంది వసుధార. ఇంతలో డాక్టర్లు వస్తారు.
వెంటనే బ్లడ్ కావాలని చెప్పాం కదా అంటాడు డాక్టర్. తనకు చాలా బ్లడ్ లాస్ అయింది అంటాడు. దీంతో బ్లడ్డా అని షాక్ అవుతారు అందరు. దీంతో నేను ఇస్తాను. నాది అదే బ్లడ్ గ్రూప్ అంటాడు రిషి. రక్తం పంచిన అమ్మకే నీ రక్తం పంచుతున్నావా రిషి అని అనుకుంటాడు మహీంద్రా.
వెంటనే జగతికి రక్తం ఇస్తాడు రిషి. రిషి మీకు రక్తం ఇచ్చాడు అని జగతికి చెబుతుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.