
Guppedantha Manasu 5 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 625 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా చెప్పినట్టుగా గౌతమ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంతలో వసుధార వచ్చి కాఫీ ఇస్తుంది రిషికి. రిషి సార్ కోపం పోయిందా అని ఆలోచిస్తుంటుంది. ఈ టైమ్ లో రిషి సార్ ను మాట్లాడించకుండా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటుంది వసుధార. కాఫీ బాగుంది అని అంటుంది వసుధార. మరోవైపు గౌతమ్.. మహీంద్రాకు ఫోన్ చేస్తాడు. నేను అమెరికా వెళ్లిపోతున్నా అంటాడు గౌతమ్. నా మాట విను ప్లీజ్ అన్నా కూడా గౌతమ్ వినడు. మిమ్మల్ని మీ ప్లాట్ లో ఉంచి ఆ విషయం దాచినందుకు వాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు అంటాడు గౌతమ్. మనల్ని ప్రేమించేవాళ్లు ఒక్క మాట అన్నా అది గుండెల్లో గుచ్చుకుంటుంది. వాడు నన్ను అసహ్యించుకుంటున్నాడు. నన్ను మోసగాడిలా చూస్తున్నాడు. నిజాన్ని దాచిపెట్టి వాడిని నిజంగానే మోసం చేశా కదా అంకుల్. అందుకే రిషి గాడికి దూరంగా వెళ్లిపోతున్నా అంటాడు గౌతమ్.
guppedantha manasu 5 december 2022 full episode
రిషి ఏదో ఆవేశంలో అని ఉంటాడు. నువ్వు చేసింది మోసం కాదు.. నువ్వు గొప్ప పని చేశావు అని మహీంద్రా అంటాడు. అయినా కూడా గౌతమ్ వినడు. బై అంకుల్.. మీరంతా ఆనందంగా ఉండండి అని చెప్పి తన బ్యాగులు సర్దుకుంటాడు గౌతమ్. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. రిషి, వసుధారను చూసి షాక్ అవుతాడు గౌతమ్. వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు అనుకుంటాడు గౌతమ్. తన చేతుల్లోని బ్యాగులను చూస్తాడు రిషి. ఏంట్రా ఎక్కడికో బయలుదేరావు అని అడుగుతాడు రిషి. లగేజ్ బాగానే ఉంది. అమెరికాకు వెళ్తున్నావన్నమాట అంటాడు రిషి. నాకు చెప్పకుండా ఫ్లైట్ ఎక్కేద్దామని ప్లాన్ చేసుకుంటున్నావా అని అంటాడు రిషి. అలా ఎలా వెళ్తావురా అంటాడు. దాచడం ఈ మధ్య నీకు బాగా అలవాటు అయింది. రేయ్ నాకు చెప్పకుండా అసలు ఎలా వెళ్తావు నువ్వు. ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ. ఇదేనా ఫ్రెండ్ షిప్ అంటే. నేను నీకు ఏం కానా. నాకు చెప్పకుండా ఎలా వెళ్తావురా ఈడియెట్ అంటూ గౌతమ్ ను హత్తుకుంటాడు రిషి. ఇద్దరూ కలిసిపోతారు.
ఒరేయ్ రిషి సారీరా. నిజాన్ని దాచిపెట్టి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అంటాడు గౌతమ్. దీంతో ఇంకేం మాట్లాడుకు. ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు అంటాడు రిషి. నాకు కోపం ఎంతో.. అంతకన్నా వంద రెట్లు ప్రేమే ఉంటుందిరా అంటాడు రిషి.
చాలా ఆలోచించాక డాడ్ వాళ్లు నీ దగ్గర కాక ఇంకెక్కడో ఉంటే ఎలా ఉండేవాళ్లో కదా. వాళ్లను నువ్వు బాగా చూసుకున్నావని డాడ్ చెప్పారు. అస్సలు డాడ్ నన్ను వదిలి ఎలా ఉంటారా అని భయపడ్డాను. నీ దగ్గర ఉండటమే కరెక్ట్ అనిపించింది. నిజాన్ని దాచిపెట్టడం తప్పేరా. ఆ విషయంలోనే నాకు కోపం వచ్చింది.
కానీ.. డాడ్ వాళ్లను బాగా చూసుకున్నందుకు థాంక్స్ రా అంటాడు రిషి. డాడ్ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. సారీరా కోపంలో చాలా తిట్టేశాను అంటాడు రిషి. కట్ చేస్తే గౌతమ్ ను తీసుకొని ఇంటికి వస్తాడు రిషి. గౌతమ్ ను చూసి షాక్ అవుతాడు మహీంద్రా.
మహీంద్రా వాచ్ ను తన చేతికి తొడుగుతాడు రిషి. ఫణీంద్రాకు ఏం అర్థం కాదు. ఏంటి ఇదంతా అంటే. గౌతమ్ ఫ్లాట్ లో నాన్న ఉన్నారు ఇన్ని రోజులు అంటాడు రిషి. దీంతో మహీంద్రా నువ్వు గౌతమ్ ఫ్లాట్ లో ఉన్నావా అంటాడు ఫణీంద్రా. దేవయాని కూడా అడుగుతుంది.
దీంతో వాడిని ఏం అనకండి. డాడ్ వాళ్లు ఇంకెక్కడికో వెళ్తే.. ఇంకెక్కడో ఉంటే చాలా కష్టపడేవారు అంటాడు రిషి. రాత్రి ఈ విషయం గురించి బాగా ఆలోచించాను. కోపం పోయింది అంటాడు రిషి. గౌతమ్ మీకు ఇన్నాళ్లు సేవలు చేసినందుకు చాలా సంతోషం వేసింది అంటాడు రిషి.
మా ఇంట్లో ఉంటున్నావు. రిషి చిన్నప్పటి ఫ్రెండ్ వు. ఇలా విషయాలు దాచిపెట్టడం తప్పు కదా అంటుంది దేవయాని. వీళ్లు ఎవరిని బాధించడానికి వెళ్లారు. అంతా ప్లాన్ చేసుకునే వెళ్లినట్టున్నారు. ఈ విషయం నీకూ తెలిసి ఉంటుందేమో ఎవరికి తెలుసు అంటుంది దేవయాని.
దీంతో డాడ్ వాళ్లు వెళ్లారు.. వచ్చారు. అయిందేదో అయింది. ఇక్కడ మనం చూసుకునే వాళ్లం. అక్కడ గౌతమ్ చూసుకున్నాడు. అంతే తేడా అంటాడు రిషి. ఎంటో వెళ్లింది.. వచ్చింది వాళ్లు.. ప్రేమగా చూసుకోవడం ఏంటి అంటుంది దేవయాని. ఇదంతా జగతి ప్లాన్ అయి ఉంటుంది అని అనుకుంటుంది దేవయాని.
చెప్తా దాని సంగతి అని జగతి దగ్గరికి వెళ్తుంది దేవయాని. ఏంటి జగతి అలా చూస్తున్నావు. తీసుకో అంటుంది దేవయాని. దీంతో అక్కయ్య మీరేంటి అంటే.. నిన్ను చూడాలనిపించి వచ్చాను జగతి. ముందు నీళ్లు తాగు అంటుంది. ఏంటి సంగతి. ఆరోగ్యం బాగున్నట్టేనా. మనసు కుదుటపడిందా. ఏంటి జగతి అలా చూస్తున్నావు. నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి గౌతమ్ ఇంట్లో మకాం వేశావు చూడు. సూపర్. నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావని తెలియదు అంటుంది దేవయాని.
మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది జగతి. దీంతో తెలిసింది జగతి. అందరికీ తెలిసింది అంటుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.