Guppedantha Manasu 7 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 549 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, దేవయాని, జగతి, మహీంద్రా అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఇంతలో రిషి.. మేడమ్ మీరు నాకు వడ్డించకండి అంటాడు రిషి. దీంతో దేవయాని సంతోషిస్తుంది. అయితే.. ఇదంతా దేవయాని కలగంటుంది. ఏంటి రిషి వద్దనలేదా… అసలు తనతో వడ్డించునేవాడు కాదు కదా. రిషి ప్రవర్తన ఏంటో మారిపోతోంది. ఎందుకు రిషి ఇలా మారిపోయాడు. తను వడ్డిస్తుంటే ఎంత సంతోషంగా తింటున్నాడు అంటూ ఆశ్చర్యపోతుంది దేవయాని. పెద్దమ్మ మీకు ఇంకేమన్నా కావాలా… నేను వడ్డిస్తాను అంటాడు రిషి. దీంతో లేదు నాన్నా చాలు.. అంటుంది దేవయాని.
పెద్దమ్మ తినండి.. ఇంకేం ఆలోచిస్తున్నారు అంటాడు రిషి. దీంతో ఇంకేం ఆలోచిస్తారు రిషి. నీ గురించే ఆలోచిస్తారు వదిన గారు అంటాడు మహీంద్రా. దీంతో జగతి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. మరోవైపు పరీక్షలు అన్నీ అయిపోవడంతో సంతోషంలో ఉంటుంది వసుధర. పరీక్షలు అయిపోయాయని పుస్తకాలను అన్నింటినీ పక్కన పడేయను. మిమ్మల్ని గౌరవిస్తాను అని పుస్తకాలతో మాట్లాడుతుంది వసుధర. రిషి సార్ కు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. కానీ.. అమ్మో వద్దులే అని అనుకుంటుంది. ఇంతలో ఫోన్ రాగానే హలో రిషి సార్ అంటుంది. కానీ.. ఫోన్ చేసింది జగతి మేడమ్. ఫోన్ ఎవరు చేశారు.. నువ్వు హలో రిషి సార్ అని అంటున్నావు అంటుంది.
నేను రిషి సార్ గురించి ఆలోచిస్తుంటే మీరు కాల్ చేశారు. అందుకే నేను రిషి సార్ అనుకున్నా అంటుంది. ఇప్పటి వరకు నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షలు ఆపేశాయి. ఇప్పుడైనా నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించు అంటుంది జగతి.
ఇంతలో రిషి సార్ తనకు కాల్ చేస్తుంటాడు. ఇన్నాళ్లు నీ లక్ష్యం కోసం నువ్వు చాలా కోల్పోయావు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లడం మంచిదే కానీ.. బంధాలకు దూరం అవడం కరెక్ట్ కాదు కదా అంటుంది జగతి.
దీంతో ఒకసారి రిషి సార్ ను అడిగి ఇంటికి వెళ్లి వస్తాను అంటుంది జగతి. ఓకే అంటుంది వసు. మీరు ఏం అనుకోనంటే ఒక మాట… రిషి సార్ కాల్ చేస్తున్నారు. అప్పటి నుంచి కాల్ వెయిటింగ్ వస్తోంది అంటుంది వసు. దీంతో సరే చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది జగతి.
మీ ఫ్రెండ్ నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు అని చందమామతో అంటాడు రిషి. ఇంతలో వసు ఫోన్ చేస్తుంది. ఏంటి వసుధర నేను ఇన్నిసార్లు ఫోన్ చేశాను. ఫోన్ బిజీ వస్తోందేంటి అంటాడు. దీంతో ఫోన్ కట్ చేయలేని వాళ్లతో మాట్లాడుతున్నాను అందుకే మీ ఫోన్ బిజీ వచ్చింది అంటుంది వసు.
ఎక్కడున్నావు అని అడుగుతాడు రిషి. దీంతో మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను అంటుంది వసు. నేను కూడా మీ ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను.. అంటాడు రిషి. దీంతో మీరు కూడా ఆకాశంలోకి చూస్తున్నారా సార్ అంటుంది వసు.
ఇంతలో ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఒకసారి నువ్వు ఇంటికి వచ్చేయ్ అంటాడు రిషి. కాదు వసుధర.. ఎప్పటికీ మా ఇంట్లో ఉండేలా వచ్చేయ్ అంటాడు రిషి.
అలా పద్ధతిగా మా ఇంటికి వచ్చేలా పెద్దమ్మతో మాట్లాడుతాను అంటాడు రిషి. మరోవైపు వసుధర పని చేసే రెస్టారెంట్ కు వెళ్తుంది దేవయాని. మనం ఒక్కోసారి మనుషుల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఒక అభిప్రాయానికి వస్తాం అంటుంది దేవయాని.
ఏదో చెబుతున్నాను అనుకుంటున్నావా. మనకు ఎంత తెలివి ఉన్నా ఎదుటివారిని అంచనా వేయడంలో ఒక్కోసారి బోర్లా పడతాం. సాక్షి విషయంలో నాకు జరిగింది ఇదే వసుధర అంటుంది దేవయాని.
నా గురించి ఏమనుకున్నావో.. ఏం అనుకుంటున్నావో తెలియదు కానీ.. సాక్షిని నేను నమ్మాను. రిషి మీద తనకు ప్రేమ ఉందనుకున్నాను. కానీ.. చివరికి రిషిని బ్లేమ్ చేసి వెళ్లిపోయింది అంటుంది దేవయాని.
గతంలో నేను నిన్ను ఏమైనా బాధపెట్టి ఉంటే అవన్నీ మనసులో నుంచి తీసేయ్. ఏదో అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఆవేశంలోనో ఏదో అని ఉంటాను. పెద్దదాన్ని కదా వదిలేయ్ అవన్నీ అంటుంది దేవయాని.
నేను చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. అందుకే నీ దగ్గరికి వచ్చాను. సాక్షి విషయంలో రిషి డిస్టర్బ్ అయ్యాడు. వీటన్నింటికీ ఒకే పరిష్కారంలా ఇంట్లో అందరి ముఖాల్లో సంతోషాలు విరబూసేలా నువ్వే చేయాలి అంటుంది దేవయాని.
దీంతో నేనేం చేయగలను అంటుంది వసుధర. జగతి, మహీంద్రల మ్యారేజ్ డే ఉంది. ఆ ఫంక్షన్ ను ఇంట్లోనే చేయాలని నా కోరిక. దానికి రిషి ఒప్పుకోవాలి. నువ్వు రిషిని ఒప్పించాలి అని అంటుంది దేవయాని. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. పెద్దమ్మ అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.