Home » Entertainment » Hansika Motwani Mind Blowing Show
Entertainment

Hansika Motwani : నీలి రంగు చీర‌లో సెగ‌లు రేపుతున్న హ‌న్సిక‌.. మ‌త్తెక్కిస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: September 18, 2022 4:13 pm
Advertisement

Hansika Motwani : దేశ‌ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగ‌మ్మ హ‌న్సిక‌. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఈ చిన్నది.. వరుస సినిమాలతో సందడి చేసింది. తద్వారా ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంది. అయితే, కొన్నేళ్లుగా మన సినిమాలను పెద్దగా చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మజాను పంచుతోంది. వ‌రుస‌ ఫొటోషూట్లతో అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. చీరకట్టులో నాజుకూ అందాలను చూపిస్తూ కుర్రకారును ఉడికిస్తోంది.

Advertisement

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. హ‌న్సిక అందాల‌ను చూసి కుర్ర‌కారు థ్రిల్ అవుతున్నారు.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ సినిమాల కంటే ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారానే తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. హన్సిక మొత్వానీ చిన్న వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో ‘హవా’, ‘కోయి మిల్‌గయా’, ‘జాగో’, ‘హమ్ కౌన్ హై’, ‘అబ్ర క దబ్ర’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చిన హన్సిక.. అల్లు అర్జున్ ‘దేశముదురు’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

Hansika Motwani mind blowing show

Advertisement

Hansika Motwani : అందాల ఆర‌బోత‌..

ఇప్పటికీ అదే స్పీడుతో హన్సిక సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘105 మినిట్స్’ వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో భాగం అయింది. వీటితో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పెఎళ్లి పీట‌లెక్కేందుకు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ శింబుతో ఆమె పెళ్లికి కూడా రెడీ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ, హన్సిక అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ ఓ బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లికి సిద్ధం అయినట్లు దేశ వ్యాప్తంగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి