Home » Entertainment » Hansika Who Made A Deal With Disney Hot Star
Entertainment

Hansika : డిస్నీ హాట్ స్టార్ తో కాబోయే మొగుడితో కలిసి డీల్ పెట్టుకున్న హన్సిక .. ఎన్ని కోట్లో తెలుసా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 14, 2022, 7:40 pm
Advertisement

Hansika : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక కూడా త్వరలో పెళ్లి పీటలెక్కపోతుంది. తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా తో తన జీవితాన్ని పంచుకోబోతుంది. ఆ పెళ్లి వార్త బయటకు రాగానే హన్సిక మీద నెగటివ్ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. చేసుకోబోయే వ్యక్తికి అంతకుముందే వివాహం అయిందని హాట్ టాపిక్ అయింది. అలాగే హన్సిక తమిళ స్టార్ హీరో తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన పెళ్లి వీడియోను ఒక ఓటీటీకి అమ్మేసింది.

Advertisement

ఇదివరకు నయనతార కూడా తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసింది. డాక్యుమెంటరీ లాగా పెళ్లి వీడియో రాబోతుంది. దానికోసం నెట్ ఫ్లిక్స్ నుంచి నయన్ అధిక మొత్తాన్ని తీసుకుందని టాక్. హన్సిక కూడా అదే ఫాలో అవుతుంది. హన్సిక పెళ్లి వీడియోలను హాట్ స్టార్ కొనేసిందట. హన్సిక పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. కేవలం కొంతమంది అతిధుల సమక్షంలో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. హన్సిక తెలుగులో దేశముదురు సినిమాతో పరిచయమైంది. తెలుగులో అంత పాపులర్ కాకపోయినా కోలీవుడ్లో టాప్ హీరోయిన్ గా నిలించింది.

Hansika who made a deal with Disney hot star

Advertisement

కోలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన మ్యారేజ్ పై వస్తున్న వార్తలు చూసినా హన్సిక ఫ్యాన్స్ కూడా అప్సెట్ లో ఉన్నారు. ఇంత అందమైన హీరోయిన్ కి సెకండ్ హ్యాండ్ భర్త అవసరమా అంటూ కామ్మెంట్స్ చేస్తున్నారు. అయితే హన్సిక మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మ్యారేజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుత హీరోయిన్స్ అంతా పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తున్నారు. మరి హాన్సిక కూడా తన మ్యారేజ్ తర్వాత సినిమాలలో నటిస్తుందో లేదో వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి