Home » Entertainment » Harassment Of The Actress In The Name Of Opportunities
Entertainment

Actress Madhavi : అవ‌కాశాల పేరుతో న‌టికి వేధింపులు.. చెప్పుతో కొడతాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో..

Authored By
mallesh
The Telugu News | Updated on: July 25, 2022 4:26 pm
Advertisement

Actress Madhavi: ప్ర‌భాస్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిర్చి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ మాధ‌వి. ఈ చిత్రంలో విల‌న్ గ్యాంగ్ లో ప‌ని చేసే ఓ యువ‌కుడి త‌ల్లిగా త‌ను ప‌డే ఆవేద‌న అద్బుతంగా చూపించింది. ప్ర‌స్తుతం సీరియ‌ల్స్, ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. కాగా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వం గురించి చెప్పుకొచ్చింది. అలాగే సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Advertisement

సినీ ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య‌కాలంలో వెలుగులోకి వ‌చ్చిన అంశం క్యాస్టింగ్ కౌచ్. దీనిపై కొంత‌మంది ఉద్య‌మం కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏదో ఒక స‌మ‌యంలో వాళ్లు ఎదుర్కొన్న వేధింపుల‌ను య‌ట‌పెడుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది సెల‌బ్రెటీలు కూడా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న‌ట్లు చాలా సంద‌ర్బాల్లో తెలిపారు. ఆఫ‌ర్లు ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన‌ వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కాగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ మాధ‌వి కూడా ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసిన‌ట్లు చెప్పింది. అయితే మాధ‌వికి కొందరు వ్యక్తులు అవకాశాల పేరుతో ఫోన్ చేసి చాలా అస‌భ్యంగా మాట్లాడారని తెలిపింది.

Harassment of the Actress Madhavi of opportunities

Advertisement

Actress Madhavi : ఫోన్ చేసి వ‌స్తావా.. అని..

ఒక‌డు ఫోన్ చేసి.. మేము నలుగురం ఉన్నాం వస్తావా.. అంటూ చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది. దీంతో సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాన‌ని పోలీస్ కంప్లైట్ కూడా ఇస్తాన‌ని చెప్ప‌డంతో మ‌ళ్లీ కాల్ చేయ‌లేద‌ని చెప్పింది. అంతేకాకుండా వాడిని చెప్పుతో కొడ‌తాన‌ని గ‌ట్టిగా చెప్పిన‌ట్లు తెలిపింది. సినీ ఇండస్ట్రీలో కొంతమంది ఆఫర్లు ఇప్పిస్తామనే వంకతో ఫోన్ నెంబర్లు తీసుకుని వేధిస్తార‌ని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అలాగని అంత ఈజీగా వదిలేసే విష‌యం కూడా కాదని చెప్పింది. అయితే ఈ సమస్య కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉందని అన్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి