Home » Entertainment » He Is The Reason Why Samantha Is Happy
Entertainment

Samantha : ఆయన వల్లే సమంత హ్యాపీ.. ఆయన ఇచ్చింది ఎప్పుడూ చేతిలోనే ఉంచుకుంటుంది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 23, 2023 11:27 pm
Advertisement

Samantha ; మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధి నుండి సమంత పూర్తిగా బయట పడ్డట్లే కనిపిస్తోంది. ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చి సందడి చేస్తోంది. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు మరియు నటిస్తున్న సినిమాల కోసం వర్క్ మొదలు పెట్టింది. సమంత ను మళ్లీ కెమెరా ముందుకు తీసుకు రాబోతున్న ఫిల్మ్‌ మేకర్స్ హడావుడి మొదలు పెట్టారు. తాజాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గొంది.. పాల్గొనబోతుంది. ఇక సమంత గురించిన ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ప్రెస్ మీట్‌ లో.. ఎయిర్‌ పోర్ట్‌ లో.. జిమ్‌ లో ఇలా ఎక్కడ కనిపించినా కూడా సమంత చేతిలో జప మాల తో కనిపిస్తూ ఉంది. శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లో సమంత చేతిలో రుద్రాక్ష మాలతో జపం చేస్తూ కనిపించింది. ఆ సమయంలో ఆమె యొక్క మానసిక ప్రశాంతత నిలకడగా ఉంటుందట. అందుకే జపం చేస్తూ సమంత తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొదటి నుండి కూడా క్రిస్టియన్‌ అయిన సమంత చైతూ తో ప్రేమలో పడ్డ సమయంలో హిందువు అయ్యింది. చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ఎక్కువగా ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు

He is the reason why Samantha is happy

Advertisement

వాసుదేవ్‌ జగ్గీ వద్ద శిష్యరికం చేసింది. ఈషా ఫౌండేషన్ అనేది జగ్గీ వాసుదేవ్ చేత భారతదేశంలోని కోయంబత్తూర్ సమీపంలో 1992లో స్థాపించబడింది. ఎంతో మంది మానసిక ప్రశాంతత కోసం వాసుదేవ్‌ జగ్గీ మార్గాన్ని చూపించారు. అలాగే సమంత యొక్క మానసిక ప్రశాంతత మరియు ఆమె శారీరక ఆరోగ్య పరిస్థితి కి జపమాలను ఆయన ఇచ్చాడట. సమంత ప్రస్తుతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి జగ్గీ వాసుదేవ్‌ ఇచ్చిన జపమాల కారణం అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సమంత మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కూడా ఆయన వద్ద శిష్యరికం చేస్తూ ఉన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి