Home » Entertainment » Hebah Patel Saree Looks Are Stunning
Entertainment

Hebah Patel : హెబ్బా.. ఏమందం అబ్బా ఇది.. సెగ‌లు రేపుతున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: August 13, 2022 7:14 pm
Advertisement

Hebah Patel : హెబ్బా ప‌టేల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. ఎన్నో చిత్రాల‌లో న‌టించిన హెబ్బాకి మంచి గుర్తింపు దక్క‌లేదు. ప్రస్తుతం చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా.. కార్తీక్ గరిమెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. శ్యామ్ దేవభక్తుని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అర్చన, అశురెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాపై అషూ రెడ్డి చాలా హోప్స్ పెట్టుకుంది.

Advertisement

Hebah Patel : అదిరింద‌బ్బా…

కుమారి 21 ఎఫ్’ సినిమాలో నటించిన హెబ్బా పటేల్.. కుర్రకారు మనస్సును దోచేసుకుంది. గతంలో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించింది. కానీ.. హెబ్బాకు రావాల్సిన ఇమేజ్ రాలేదు. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రెడ్’ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈమె..అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. తాజాగా చీర‌క‌ట్టులో కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

Hebah Patel saree looks are stunning

Advertisement

సెగ‌లు పుట్టించే అందంతో హెబ్బా మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. హెబ్బా ప‌టేల్ షాకింగ్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. చీర కట్టులో ఆమె సోకులు మైమరపింపజేసే విధంగా ఉన్నాయి. పురి విప్పిన నెమలిని మించేలా అందంతో అదరగొడుతోంది హెబ్బా. ఈ అమ్మ‌డు నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. టాలీవుడ్ లో హెబ్బా పటేల్ కి ఉండే క్రేజ్ వేరు. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ యువతలో ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి