
Hema : అబద్దాల మీద అబద్దాలు చెబుతూ ఇరుకున పడుతున్న హేమ.. ఎందుకిలా చేస్తుంది..!
Hema : బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. హేమ, శ్రీకాంత్, జానీ మాస్టర్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని ప్రచారం జరగగా, దానిపై ముగ్గురు స్పందించారు. హేమ తమకు ఆ రేవ్ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. దానిపై బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇస్తే..ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నదని, కాని పాల్గొలేదని చేసిన వీడియో తప్పుదారి పట్టించడం కోసమే చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ వీడియో ఎలా చేశారు అన్నదానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఆ వీడియోలో హేమ పేర్కొంది. అయితే హేమ విడుదల చేసిన ఫోటో.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లోనిదేనని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తను హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో చిల్ అవుతున్నానని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన హేమ ఈరోజు మళ్లీ కొత్తగా ఇంకొక వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో ద్వారా తనకు బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు తనకేమీ తెలియదు అన్నట్టు, తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా వంట చేసుకుంటున్నట్టు బిర్యానీ తయారు చేస్తున్న ఒక వీడియోను హేమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఆమె ఉందని పోలీసులు చెబుతున్నా కూడా ఈమె ఇలా డ్రామాలు ఆడుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక హేమ గురించి కరాటే కళ్యాణి దారుణమైన కామెంట్స్ చేసింది.
Hema : అబద్దాల మీద అబద్దాలు చెబుతూ ఇరుకున పడుతున్న హేమ.. ఎందుకిలా చేస్తుంది..!
హేమకి హైలైట్ కావాలనే పిచ్చి ఉంటుందని, అందుకే ఎక్కువగా హడావుడి చేస్తుంటుందని, ఇప్పుడు కూడా అదే చేసిందని, కానీ బాగా ఇరుక్కుపోయిందని కళ్యాణి తెలిపింది. అందరిపై ఆరోపణలు చేస్తూ ఊసురు పోసుకుందని, ఇప్పుడు ఆమెకే ఆ ఊసురు తగిలిందని ఆరోపించింది . తనని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిందని, ఇలా చాలా మందిపై ఆమె తన నోటి దూల చూపిస్తుందని ఆరోపించింది ..మొదట్నుంచి అన్నీ ఫేక్ పనులే చేస్తుంటుందని, ఫేక్ వీడియో రిలీజ్ చేసి అందరిని తప్పుదోవ పట్టిస్తుందని, ఇప్పుడు చికెన్ వీడియోతో కూడా మరింతగా మిస్ లీడ్ చేస్తుందని, అయితే ఈ మిస్టేక్స్ చేస్తూ మరింత గట్టిగా దొరికిపోయిందని తెలిపింది. రేవ్ పార్టీలకు వెళ్లేవారికి కర్రపట్టుకుని రేవ్ పెట్టాలి అంటూ ఫైర్ అయ్యింది. మా అసోసియేషన్‌లో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరని, హేమకి సస్పెన్షన్ పడే అవకాశం ఉందని తెలిపింది కరాటే కళ్యాణి.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.