Hero Suman Daughter : స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతున్న హీరో సుమన్ కూతురు !
Hero Suman Daughter : హీరో సుమన్ తెలుసు కదా. తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం హీరోగా రాణించలేకపోయారు. స్టార్ హీరో కాలేకపోయినా ఒక మంచి నటుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. 90ల్లో సౌత్ ఇండియాలో సుమన్ స్టార్ హీరో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు సుమన్. నిజానికి సుమన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయనకు మంచి గుర్తింపు వస్తోంది.
hero suman daughter to marry star hero son
అన్ని రకాల పాత్రలను అవలీలగా పండించగలరు సుమన్. అయితే.. ఇటీవల సుమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తను ఆ మధ్య జైలుకు వెళ్లిన విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. తనకు సంబంధం లేని కేసులో సుమన్ ను ఇరికించారట. అప్పట్లో తనకు సీనియర్ హీరోయిన్లు సుహాసిని, సుమలత బాగా సపోర్ట్ చేశారట. ఇక.. తన కూతురు గురించి కూడా చెప్పుకొచ్చారు సుమన్. తన కూతురు పేరు ప్రత్యూష. తనకు యాక్టింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదట. సుమన్ కూతురు మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
Hero Suman Daughter : మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్న సుమన్ కూతురు
ఆమె హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. అయితే.. ఆమె సౌత్ ఇండియాకి చెందిన ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తోందని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. అలాంటి వార్తలు నిజం కాదని.. అవన్నీ ఉత్తివేనన్నారు. అసలు ఇప్పుడే ప్రత్యూషకు పెళ్లి చేసే ఆలోచన లేదని.. ఆమె చదువు పూర్తయ్యాక చదువు గురించి ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు సుమన్. ఆయన.. 1985 లో శిరీష అనే యువతిని పెళ్లాడారు. వాళ్లకు ఒక కూతురు జన్మించింది. జైలు నుంచి వచ్చిన తర్వాతనే సుమన్ పెళ్లి అయింది. అప్పట్లో ఫేమస్ రచయిత అయిన డీవీ నరసరాజు మనవరాలిని సుమన్ పెళ్లి చేసుకున్నారు.
