Home » Entertainment » Heroine Krithi Shetty Secret Dating With That Star Hero
Entertainment

Krithi Shetty : హీరోయిన్ కృతి శెట్టి సీక్రెట్ డేటింగ్.. ఏకంగా స్టార్ హీరోను బుట్టలో పడేసిందంటగా?

Authored By
mallesh
The Telugu News | Updated on: September 19, 2022 4:54 pm
Advertisement

Krithi Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు సంచలనానికి దారి తీస్తున్నాయి.ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన ఏడాదిలోనే ఏకంగా ఆరు నుంచి ఏడు సినిమాలు చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన చేయడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కృతి ఓ స్టార్ హీరోను తన బుట్టలో వేసుకుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Krithi Shetty : ఎవరా స్టార్ హీరో..

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది కృతి శెట్టి.. తన ఈ సొట్ట బుగ్గలతో కుర్రకారును ఆకట్టుకుంది. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. మంచి అందం, అభినయంతో ప్రతి పాత్రలోనూ తన ముఖ కవళికలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కృతి ఇటీవల కాలంలో బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ మూవీస్ చేయగా అవి మంచి విజయాన్ని అందుకున్నాయి.

Heroine Krithi Shetty Secret Dating With That Star Hero

Advertisement

అయితే, రీసెంట్‌గా కృతి రామ్ పోతినేనితో కలిసి వారియర్ సినిమాలో నటించింది. ఇందులో విజిల్ మహాలక్ష్మి పాత్రలో వంద శాతం ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో నిరాశ చెందిన కృతి తన అమ్మతో కలిసి గుళ్లు గోపురాలు తిరగడం ప్రారంభించింది. తన తదుపరి సినిమాలు విజయం సాధించాలని కోరుకుందట..

ఈ క్రమంలోనే కృతి ఓ స్టార్ హీరోతో గుట్టుగా డేటింగ్ చేస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. ఇంతకు ఎవరా హీరో అని చాలా మంది వెతుకుతున్నారట.. ఎవరికీ కనిపించకుండా రాత్రుళ్లు జర్నీలు చేస్తున్నారని.. ఐటెండిటి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కృతికి ఈ మధ్య సినిమా అవకాశాల తగ్గాయట.. ఈ స్టార్ హీరోను బుట్టలో వేసుకుంటే అవకాశాలు వస్తాయని ప్లాన్ చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి