Heroine : ఆ హీరోయిన్ ని వాడుకొని వదిలేసారా.. పాపం పరిస్థితి దారుణంగా ఉందే..!
Heroine : సురభి .. ఈ అమ్మడి అసలు పేరు సురభి పురాణిక్. అడపాదడపా చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన సురభి ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయింది. తమిళ హీరో ధనూష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్ సినిమాలు చేసి ఆ తర్వాత శశి సినిమాలోనూ నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె నటించిన సినిమాల్లో జెంటిల్ మన్ సినిమా ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.సినిమాలలో తన అందం నటనతో ప్రేక్షకులను మెప్పించిన అప్పటికీ హీరోయిన్ తెలుగులో అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.
Heroine : పాపం సురభి..
అందం ఉంది.. అభినయం ఉన్నా కానీ, సురభి ఎందుకు స్టార్ హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. దీనికి కారణం ఆమెకు సరైన సపోర్ట్ లేకపోవడమే అని అంటున్నారు. సపోర్ట్ ఉంటే ఏ పూజా హెగ్డేనో, ఏ రష్మిక మందన్ననో అయి ఉండేది. పెద్ద దర్శకులు గనక పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే సురభి రేంజ్ ఇప్పుడు మరోలా ఉండేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో సురభి ఫేడవుట్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. అయితే, అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లో కనిపిస్తోంది.
Heroine Surabhi About Her Career In Social Media
ముద్దు సన్నివేశాలకి, రొమాంటిక్ సీన్స్‌కి, బికినీ సూట్స్‌కి వెనకాడదు. మరి అవకాశాలు ఇచ్చే వాళ్లే కరువయ్యారు. లాక్ డౌన్ సమయం వరకూ అడపా దడపా అవకాశాలతో దూసుకెళ్లిన సురభి లాక్ డౌన్ తరువాత అంతగా అలరించలేకపోతుంది. ఇకపోతే సురభి ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర పై కనిపించి సందడి చేయాలని అనుకుంటుంది. కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ అభిమానులకు మరింత చేరువగా ఉంటుంది.
Heroine Surabhi About Her Career In Social Media
