Heroines : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చాలామంది ముద్దుగుమ్మలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కొందరు హీరోయిన్స్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఆస్తులు పెద్దగా లేకపోవడంతో చాలా కష్టపడాల్సిన పరిస్థితి. కాని ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చారో రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నారో చూద్దాం. ముందుగా సమంత విషయానికి వస్తే ఒకప్పుడు ఆమె అకౌంట్ లో వంద రూపాయలు కూడా ఉండేటివి కాదట . ఏ మాయ చేశావే సినిమా తర్వాతే ఆమె డబ్బులు సంపాదించి తండ్రికి హెల్ప్ గా నిలిచింది.
ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్ నాలుగు నుండి ఐదు కోట్లుగా ఉంది. నేషనల్ క్రష్ రష్మిక విషయానికి వస్తే.. చిన్నప్పుడు బొమ్మ కొనుక్కోవడానికి ఇంట్లో వారు ఆలోచించేవారట. ఎక్కడ చీప్ గా రెంటుకి ఇల్లు దొరికితే అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండేవారు. అలాంటి రష్మిక ఇప్పుడుఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. ఒకప్పడు ఆమె పరిస్థితి దారుణంగా ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక రేంజ్ మారింది. మొన్నటి వరకు అదృష్ట దేవతగా పూజాని చూసిన కొందరు డైరెక్టర్స్ ఇప్పుడు పక్కన పెట్టేశారు. పూజ హెగ్డే ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఐదు కోట్లు కూడా తీసుకుంటుందట
ఇక మహానటి కీర్తి సురేష్.. ఇండస్ట్రీలోకి రాకముందు పది రూపాయలు కావాలన్నా అమ్మని అడిగే కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరెషన్ గా అందుకుంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బు కోసం చాలా అల్లాడింది . అంతే కాదు ఒకానొక టైం లో ఎయిర్ హోస్టర్స్ గా కూడా సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ శేఖర్ కమ్ముల సినిమా హ్యాపీడేస్‌తో తన కెరీర్ మారిపోయింది. ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల పారితోషకం తీసుకుంటూ ఉంది. ప్రస్తుతం అయితే పెద్దగా అవకాశాలు లేవు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.