Home » Entertainment » Hyper Aadi And Ram Prasad On Rohini And Pavithra In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : పవిత్ర, రోహిణిలంటే మరీ అంత చులకనా?.. రెచ్చిపోయిన హైపర్ ఆది, రాం ప్రసాద్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 6, 2022 4:12 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బాడీ షేమింగ్ చేస్తూ హైపర్ ఆది వేసే పంచులను అందరూ ఓ లైన్ వరకు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అవే ఒక్కోసారి హద్దులు మీరుతుంటాయి. అలా ఆది వేసే సెటైర్లు ఒక్కోసారి ఏవగింపును కలిగిస్తుంటాయి. అవతలి వాళ్లను కించపరిచేలా ఉంటాయి. శరీరాకృతి మీద కౌంటర్లు వేస్తూ కామెడీని పుట్టించాలని ప్రయత్నిస్తుంటాడు ఆది. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా హద్దులు దాటేశారు. వచ్చీ రాగానే పూర్ణను హగ్గులు కావాలంటూ అడిగేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఓ రూల్ ఉంది..

Advertisement

రాగానే మాకు హగ్గులు ఇవ్వాలి.. ఆ తరువాత మేం ఇచ్చేది తీసుకోవాలని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడు. ఏం ఇస్తారు అని హగ్గే అని అంటాడు ఆది. అయితే ఆ హగ్గులు మేం ఇస్తామంటూ రోహిణి, పవిత్రలు వస్తుంటారు. మీరు తప్పా ఎవ్వరైనా రండి అని టీంలోని మిగతా సభ్యుల గురించి చెబుతారు. మరో సందర్భంలోనూ ఇలానే హగ్గుల విషయం వస్తుంది. లేడీ గెటప్పులే గొప్ప.. కావాలంటే చూడండి అని వారిని హగ్ చేసుకుంటారు ఇమాన్యుయేల్, నూకరాజు. మేం కూడా చేస్తామన్నట్టుగా లేడీ ఆర్టిస్టులను పిలుస్తాడు ఆది. ఇంతలోపు రోహిణి, పవిత్రలు లేచి వస్తారు.. చీ చీ మీరు మాత్రం రాకండి అని అనేస్తాడు.

Hyper Aadi And Ram Prasad On ROhini And Pavithra In Sridevi Drama Company

Advertisement

ఇలా పలు సందర్భాల్లో పవిత్ర, రోహిణిలను తన సెటైర్లతో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా కించపరుస్తుంటారు. మొత్తానికి లేడీ ఆర్టిస్టుల్లో రోహిణి, పవిత్ర, రీతూ, భాను, వర్షలు అందరూ ఉన్నా కూడా ఆ ఇద్దరిని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రం లేడీ ఆర్టిస్టులు, లేడీ గెటప్పుల మధ్య పోటీ బాగానే జరిగింది. ఆ పోటీలో భాగంగానే ఆది కొన్ని సార్లు బార్డర్ దాటి మరీ కామెడీ చేశాడు. అందులో ఎక్కువగా బాడీ షేమింగ్ కామెంట్లే కనిపించాయి. అయితే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి వారు కూడా అంత సీరియస్‌గా వాటిని తీసుకోవడం లేదు. కానీ ఎప్పుడూ ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్లేనా?అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి