
Hyper Aadi And Ram Prasad Satires on Rashmi Gautam Anchoring
Hyper Aadi : శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఇప్పుడు అంతా కూడా హైపర్ ఆది, రాం ప్రసాద్‌ల హవానే సాగుతోంది. ఈ ఇద్దరూ పంచులు, ఆటో పంచులతో ఆడేసుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన రష్మీని మాత్రం తెగ టీజ్ చేసేస్తున్నారు. మాట్లాడితే ఆమె యాంకరింగ్ మీద సెటైర్లు పడుతున్నాయి. ఇక సుధీర్ పేరు ఎత్తకుండానే బాబు అంటూ రష్మీ నోరు మూయించేస్తున్నారు ఆది, రాం ప్రసాద్‌లు. మొత్తానికి తాజాగా ఎపిసోడ్‌లో రష్మీని ఆడేసుకున్నారు. ఎంట్రీలోనే రష్మీకి పంచుల మీద పంచులు పడ్డాయి.
పని లేనోళ్లిద్దరూ వచ్చారు అని ఆది, రాం ప్రసాద్‌ను అంటుంది రష్మీ. అవును మరి మీరు ఎందుకు వచ్చారు అని రష్మీ, ప్రగతి మీద కౌంటర్లు వేస్తాడు ఆది. శ్రీదేవీ డ్రామా కంపెనీ కాలెండర్‌ను చేతిలో పట్టుకుని రష్మీ ఉంటుంది. ఇదేంటో తెలుసా? అని రష్మీ అడుగుతుంది.. ఏంటది.. బాబుకి నీకు విడాకులు నోటీసా? అని ఆది అనడంతో రష్మీ షాక్ అవుతుంది. అలా ప్రతీ సందర్భంలో రష్మీ మీద పంచ్‌లు వేస్తూనే వచ్చారు.
Hyper Aadi And Ram Prasad Satires on Rashmi Gautam Anchoring
ఇక ఎపిసోడ్ మధ్యలో రష్మీ తన కోరికను బయటపెట్టేసింది. వెయ్యి ఎపిసోడ్‌లకు తానే యాంకర్‌గా ఉంటానని, అట్లుంటది మనతోని అంటూ రష్మీ రెచ్చిపోయింది. అంతలేదులే.. ఇంకో నాలుగైదు ఎపిసోడ్‌లే అన్నట్టుగా ఆది, రాం ప్రసాద్‌లు కౌంటర్లు వేస్తారు. మొత్తానికి ఈ షోలో మాత్రం రష్మీ బాగానే సింక్ అయింది. సుధీర్ పేరుని పరోక్షంగా వాడేసుకుంటూ.. రష్మీని ఆడేసుకుంటున్నారు ఆది, రాం ప్రసాద్. రష్మీ సైతం ఆది, రాం ప్రసాద్‌ల సెటైర్లను ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తొంది.
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…
Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…
Alcohol : మనలో చాలామంది మద్యం తాగడాన్ని ఒక సాధారణ అలవాటుగా లేదా సరదాగా భావిస్తుంటారు. కానీ మీరు తాగే…
Gold, Silver Rate Today, 13 February 2026 : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముంగిట ఉన్న తరుణంలో, ఆకాశాన్నంటుతున్న…
Brahmamudi February 13th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.…
Ram Charan twins names : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. గ్లోబల్…
Coffee for Memory : ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ వాసన రాకపోతే చాలామందికి రోజు సరిగా మొదలైనట్టే…
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
This website uses cookies.