
Hyper Aadi And Sudigali Sudheer Did not go to Comedy Stars Adirindi Show
Sudigali Sudheer : జబర్దస్త్ నుంచి నితిన్ భరత్, నాగబాబు బయటకు వెళ్లడంతో చీలికలు మొదలయ్యాయి. అయితే ఆ నాడు జరిగిన ఘటనలో నాగబాబుతో కొంత మంది బయటకు వచ్చేశారు. ఇంకొంత మంది కూడా వస్తారని అంతా అనుకున్నారు. నాగబాబు అంటే వీర విధేయతను చూపించే వారైనా సుధీర్, ఆది కూడా వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తేడా కొట్టేసిందట. ఆ విషయాలన్నీ కూడా తాజాగా ఆది బయటపెట్టేశాడు. ఆ గొడవ కూడా కొందరి ఆర్టిస్టుల వల్ల జరిగిందని అసలు విషయం చెప్పేశాడు. రెండు చీలికలు రావడానికి కారణం ఎవరో నాకు తెలుసు.. అది సమయం వచ్చినప్పుడు చెబుతాను. కొందరి వల్ల నితిన్ భరత్, నాగబాబు గారు బయటకు వెళ్లాల్సి వచ్చింది..
వారితో పాటు మేం కూడా వెళ్లాల్సింది.. అయితే మా ఉద్దేశ్యంలో అప్పుడు మేం ఇక్కడా అక్కడా చేసుకోగలమని అనుకున్నాం. కానీ అప్పుడే మాకు ఈ అగ్రిమెంట్ల గురించి తెలిసింది. మేం ఇంకో షోను అలా చేయలేమనే నిబంధన ఉందని మాకు తెలియడంతో మేం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.. పైగా అక్కడి పరిస్థితులు నాకు అంతగా నచ్చలేదు అందుకే వెళ్లలేదు అని ఆది చెప్పేశాడు. అయితే నాగబాబు వెంట వెళ్లకపోవడంపైనా క్లారిటీ ఇచ్చాడు. కిరాక్ ఆర్పీ పచ్చ బొట్టు పొడిపించుకోవడంపైనా రియాక్ట్ అయ్యాడు. ఆయన మీదున్న ప్రేమ అనేది నేను చెప్పాల్సిన పని లేదు. నాకు చిరంజీవి గారి అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా..
Hyper Aadi And Sudigali Sudheer Did not go to Comedy Stars Adirindi Show
నాగబాబు గారు అన్నా పిచ్చి.. వాళ్లను ఎవరైనా ఏమైనా అంటే.. నెగెటివ్ కామెంట్లు చేస్తే ముందుండేది నేను.. ఫస్ట్ మాట్లాడేది నేను అని ఆది అనేశాడు. అయినా నాగబాబు గారు ముందుంటే ఒకలా.. లేకపోతే ఇంకోలా మాట్లాడే వారు గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా నేరుగా ఒకరోజు నాగబాబు గారితో చెబుతాను. ఆ వ్యక్తులు ఎలాంటి వారో చెబుతాను అని ఆది అనేశాడు. మొత్తానికి అదిరింది, కామెడీ స్టార్స్ షోలకు వెళ్లలేకపోవడానికి ఆ అగ్రిమెంట్లు కూడా ఓ కారణమేనని ఆది ఒప్పుకున్నాడు. మొత్తానికి సుధీర్ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడంతోనే అక్కడకు వెళ్లాడని, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వెళ్లినట్టు చెప్పకనే చెప్పేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.