Hyper Aadi Beats Anchor Rashmi in Sridevi Drama Company
Anchor Rashmi : యాంకర్ రష్మీతో సుధీర్ ఎక్కువ పరాచకాలు ఆడుతుంటాడు. అనసూయతో ఆది ఓ సరసం లాంటి చేష్టలు చేస్తుంటాడు. జబర్దస్త్ షోలో ఆది అనసూయ ట్రాక్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ సందడి చేసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. జబర్దస్త్ నుంచి ఆది వెళ్లిపోయాడు.. ఇప్పుడు అనసూయ కూడా తప్పుకుంది. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ ఎప్పుడో వెళ్లిపోయాడు. రష్మీ అక్కడే ఉండిపోయింది. ఇక సుధీర్ స్థానాన్ని శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ భర్తీ చేసేందుకు వచ్చింది. సుధీర్ రేంజ్‌లో కాకపోయినా రష్మీ తన స్థాయిలో షోను నడిస్తోంది. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో రష్మీని వీరబాదుడు బాదేశాడు ఆది.
ఆషాడం అల్లుళ్లు అంటూ వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు.ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఒక చోట ఉండొద్దంటూ ఫన్ క్రియేట్ చేశారు. ఇందులో ఆదికి భార్యగా గీతా సింగ్ నటించింది. ప్రోమో మొత్తంలో ఆది అందరినీ రఫ్పాడించాడు. చివరకు రష్మీని సైతం పటా పటా వాయించేశాడు. కళ్లకు గంతలు కట్టి..మధ్యలో వదిలేస్తారు.. చుట్టూ అత్తలు ఉంటారు.. చేతికి కర్ర కూడా ఇస్తారు. ఇక కళ్లకు గంతలు కట్టిన వ్యక్తి.. అత్తలను పట్టుకుని కొట్టాలి. దీంట్లో భాగంగా ముందు ఆది మీద ప్రయోగం చేస్తారు.ఆది కళ్లకు గంతలు కడుతుంది రష్మీ. ఇక అత్తలను పట్టుకో అని రష్మీ అంటే..
Hyper Aadi Beats Anchor Rashmi in Sridevi Drama Company
ఆది మాత్రం రివర్స్‌లో వచ్చాడు. రష్మీనే అత్త అన్నట్టుగా.. టపాటపా దంచిపడేశాడు. నేను రష్మీని అని ఎంత మొత్తుకున్నా కూడా ఆది వినకుండా వాయిస్తూనే వచ్చాడు. అయితే ఆది మాత్రం కావాలనే రష్మీని అలా బాదేసినట్టు అనిపిస్తోంది. ఇక ఆది తరువాత అత్తలను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఎంత తిరిగినా కళ్లకు గంతలు ఉండటంతో.. వారిని పట్టుకోలేకపోయాడు ఆది. చివరకు రాంప్రసాద్ వాళ్ల వద్దకు వెళ్లారు.. అటు సైడ్ వెళ్లు అని చెప్పినా కూడా ఆది వినకుండా.. రాంప్రసాద్‌ను కొట్టేశాడు. అలా ఈ ఇద్దరూ కొట్టేసుకున్నారు. మొత్తానికి ప్రోమో మాత్రం తెగ నవ్వులు పూయించారు.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.