Hyper Aadi : జానీ మాస్టర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి.. హైపర్ ఆది అప్పట్లోనే చెప్పేశాడుగా..!
Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే.. కేవలం లైంగిక దాడి చేయడమే కాకుండా.. మతం మార్చుకోమని ఆమెను బెదిరిస్తూ ఉండేవాట. మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడట. ఇలా ఆ ఎఫ్ఐఆర్‌లో చాలా అంశాలున్నాయి. పైగా జానీ మాస్టర్ భార్య సైతం ఆమెను తీవ్రంగా కొట్టేదట. తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరించేదట. ఇలా ఆమె చేసిన ఫిర్యాదు మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.ఢీ షోలో తమకు పరిచయం ఏర్పడిందని, ఆ తరువాత తన గ్రూపులో తీసుకుంటానని నమ్మబలికాడట జానీ మాస్టర్.
ఆ తరువాత ఆమెను అవుట్ డోర్ షూటింగ్‌లకు తీసుకెళ్లి అక్కడ పలు మార్లు అత్యాచారం చేశాడట. ఆ విషయాన్ని బయటకు చెబితే.. కెరీర్ నాశనం చేస్తానని, ఇండస్ట్రీలో ఉండనివ్వను అంటూ బెదిరించేవాడట. ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. ఇక కేరవ్యాన్‌లో కూడా వదిలి పెట్టే వాడు కాదని, అక్కడ కూడా హింసించేవాడని, వేధించేవాడని చెప్పుకొచ్చింది. తనను ఎంత హింసించినా కూడా మతాన్ని మార్చుకోలేదని ఆ ఫిర్యాదులో శ్రేష్ట చెప్పుకొచ్చింది. ఈ ఫిర్యాదు చూస్తుంటే జానీ మాస్టర్ మెడకు ఉచ్చు గట్టిగానే బిగుసుకునేలా ఉంది. అసలు జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు, కాంట్రవర్సీలు ఈ మధ్య బాగా వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక షోలో జానీ మాస్టర్ రాసలీలల గురించి హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Hyper Aadi : జానీ మాస్టర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి.. హైపర్ ఆది అప్పట్లోనే చెప్పేశాడుగా..!
ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జానీ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. కొన్నిసార్లు శేఖర్ మాస్టర్ రాకపోతే ఆ ప్లేస్ ను జానీ మాస్టర్ రీప్లేస్ చేస్తాడు. అలా వచ్చిన ప్రతిసారి హైపర్ ఆది.. తన పంచ్ లతో జానీ మాస్టర్ ను నవ్విస్తూ ఉంటాడు. ఇక ఒకసారి ప్రణీత గెస్ట్ గా వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ హైపర్ ఆది.. ఈరోజు జానీ అని నాకన్నా పెద్ద బ్యాట్స్ మెన్ వచ్చాడట కదా.. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల. ఆ ఆట ఆగదు. నీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా అమాయకుడు.. ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. జానీ మాస్టర్ డైరెక్ట్ గానే. గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ కు చిన్న తేడా మాత్రమే.. గణేష్ మాస్టర్ అప్పులు తీరుస్తాడు.. జానీ మాస్టర్ ఆకలి తీరుస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆది ఆకలి అన్నది అమ్మాయిల గురించే అని కామెంట్స్ పెడుతున్నారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.