Home » Entertainment » Hyper Aadi Dirty Comments On Rithu Chowdary In Jabardasth
Entertainment

Hyper Aadi : ఇంత కంటే ఘోరం ఉంటుందా?.. రీతూని కించపరిచిన హైపర్ ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 26, 2021 11:42 am
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి వారికి కావలసిన వినోదాన్ని పంచుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది స్కిట్ వస్తే నిమిష నిమిషానికి పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది రీతూను దారుణంగా అవమానించాడు. సాధారణంగా హైపర్ ఆది ప్రతిసారీ స్కిట్ చేసినప్పుడు కొత్తవారిని వేదిక పైకి తీసుకురావడం సర్వసాధారణం. అలా తీసుకొచ్చిన వారిలో రీతు కూడా ఒకరు. రీతు ఈ స్కిట్ లో హైపర్ ఆది కూతురుగా సందడి చేసింది. స్కిట్ మొదట్లో శాంతి స్వరూప్ తో కలిసి రొమాంటిక్ సాంగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన కూతుళ్లను పిలవమని చెబుతాడు.

Hyper aadi dirty comments on rithu chowdary in jabardasth

Advertisement

Hyper Aadi : రీతూ పరువుతీసిన ఆది..

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ఏంటి పెద్ద కూతురా చాలా డల్ గా ఉన్నావు అని అడగడంతో వెంటనే రీతూ మాట్లాడుతూ.. మొన్న మీరు పక్కన ఉండగానే ఆ కాలేజ్ వాచ్ మెన్ అదోలా చూస్తున్నాడు నాన్న అని చెప్పడంతో ఆది నా పక్కన ఆయాగా చేయాల్సింది తన పక్కన కూతురుగా చేస్తున్నావ్ ఏంటి అని చూసి ఉంటాడు అంటూ పరోక్షంగా తనని ఆయా అంటూ హైపర్ ఆది తనని దారుణంగా అవమాన పరిచారు. అంతేకాదు ప్రతి స్కిట్ లో రీతూపై పంచులు వేస్తూనే ఉంటాడు అలానే ఈరోజు కూడా అది కప్పనే అన్నాడు.. అనంతరం దానికి అసలు మొహమే లేదు.. ముందు అది ఉండాలిగా అని పంచులు వేసుకుంటూ వచ్చాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి