Home » Entertainment » Hyper Aadi Emotional In Jodi No 1 Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : ఏడిపించేసిన హైపర్ ఆది.. పదో తరగతిలో అంటూ ఎమోషనల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 13, 2022, 8:00 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోలో ఆది ఉంటే.. ఆ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే ఆదికి అంత క్రేజ్. ఆది చెప్పినంత ఇవ్వాల్సిందే. సెటైర్లు ఎవరి మీద వేసినా సరే.. నవ్వుతూ తీసుకోవాల్సిందే. అలా ఆదికి బుల్లితెర మీద తిరుగులేకుండాపోయింది. అయితే ఆదికి ఓ లవ్ స్టోరీ ఉందన్న సంగతి తెలిసిందే. ఆదికి తన స్కూల్లో ఓ అమ్మాయి మీద ఇష్టం ఏర్పడింది.

Advertisement

ఈ విషయాల మీద ఆది ఇది వరకే ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఆమె సైకిల్ మీద అలా వస్తుంటే.. ఫిదా అయ్యేవాడిని అంటూ ఆది తన స్కూల్ మెమోరీస్‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమెను ప్రేమించాను అని, తనే మొదటి క్రష్ అంటూఇలా చాలానే చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయం మీద స్పందించేశాడు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో వచ్చింది. ఇందులో నెంబర్ వన్ జోడి అనే కాన్సెప్ట్‌‌ను తీసుకున్నారు. ఇందులో భాగంగా బుల్లితెర జోడిలను పట్టుకొచ్చారు.

Hyper Aadi Emotional in jodi no 1 Sridevi drama company

Advertisement

జబర్దస్త్ షోలో జోడిలుగా చెలామణి అవుతున్న వారిని కూడా తీసుకొచ్చారు. నూకరాజు ఆసియా, ఐశ్వర్య, షబినా, సుజాత ఇలా అందరినీ వాడేశారు. షబినా అయితే తనకు కాబోయే వాడిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి మరీ రొమాన్స్ చేసింది. ఇదే క్రమంలో సర్ ప్రైజ్ గిఫ్టులు అనే కాన్సెప్ట్ కూడా పెట్టారు. ఇందులో భాగంగా ఆది పదో తరగతిలో రాసిన లవ్ లెటర్ తిరిగి వచ్చింది. ఆ లెటర్ చదువుతూ ఆది ఎమోషనల్ అయ్యాడు. అందరినీ ఏడిపించేశాడు. మరి ఆ లెటర్‌లో ఆది గతంలో ఏ రాశాడో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి