
Hyper Aadi Emotional Words on Punch Prasad Wife
Hyper Aadi : హైపర్ ఆది ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. ఆయన వేసే పంచులు కూడా అలానే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆది తన గుండె లోతుల్లోంచి కొన్ని మాటలు అంటాడు. పవన్ కళ్యాణ్ గురించి షోల్లో చెప్పే సమయంలో అనే మాటలు, ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. తన తల్లిదండ్రుల గురించి, తన స్ట్రగుల్స్ గురించి చెప్పి ఎన్నో సార్లు అందరినీ ఏడిపించేశాడు. తాజాగా పంచ్ ప్రసాద్ భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. పంచ్ ప్రసాద్, అతని భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పంచ్ ప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమ అంటే కలిసి తిరిగి ఎంజాయ్ చేసేటువంటి ప్రేమ కాదు. జీవితాంతం తన భర్త కోసం నిలబడే ప్రేమ అది. ఏ భార్య చేయని త్యాగం చేసే ప్రేమ అది. పంచ్ ప్రసాద్ చావు బతుకుల్లో ఉన్నా కూడా వదలని ప్రేమ అది. పెళ్లికి ముందే.. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. చావు బతుకుల్లో ప్రసాద్ ఉన్నాడు. అలాంటివాడిని ఏం చేసుకుంటావ్ అని అందరూ వేలెత్తి చూపారు. అయినా కూడా తాను ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టలేదు. కాపాడుకుంది.
Hyper Aadi Emotional Words on Punch Prasad Wife
ఓ కిడ్నీ ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చింది. అలా తన భర్త కోసం అందరినీ ఎదిరించింది పంచ్ ప్రసాద్ భార్య. తాజాగా వీరి జర్నీని ఓ పర్ఫామెన్స్లో చూపించారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో నెంబర్ వన్ జోడి అనే కాన్సెప్టుతో వచ్చే ఆదివారం షోను రన్ చేస్తున్నారు. ఇందులో పంచ్ ప్రసాద్ లవ్ స్టోరిని పర్ఫామెన్స్ చేసి చూపించారు. అది చూసి పంచ్ ప్రసాద్ భార్య ఎమోషనల్ అయింది. ప్రేమ కోసంఎంతో ఖర్చు పెట్టిన వారిని చూశాం గానీ.. ప్రేమ కోసం తన జీవితాన్ని ఖర్చు పెట్టింది అంటూ ఆమె మీద ఆది ప్రశంసల వర్షం కురిపించేశాడు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.