Home » Entertainment » Hyper Aadi Fun Game In Sridevi Drama Company Latest Promo
Entertainment

Hyper Aadi : కరువు మీదున్న హైపర్ ఆది.. ఆ గేమ్ మాత్రం కావాల్సిందేనట

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 13, 2022 5:55 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే జోకులన్నీ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అడల్ట్ జోకులే ఎక్కువగా ఉంటాయి. కాక మీదున్నట్టుగా మాట్లాడతాడు. కానీ చేసేది ఏం ఉండదు అని కూడా తానే చెప్పుకుంటాడు. అలా తన మీద తానే జోకులు వేసుకుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలోనూ ఇలాంటి కామెంట్లే చేశాడు. కరువు మీదున్నట్టుగా ప్రకటించేసుకున్నాడు. నెంబర్ వన్ జోడి అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ కాన్సెప్టుతో వచ్చే ఆదివారం షో చేస్తోంది.

Advertisement

ఇందులో అందరూ జోడిలుగా పార్టిసిపేట్ చేశారు. అయితే మ్యూజిక్ చెయిర్ ఆటను కూడా పెట్టారు. మామూలుగా మ్యూజికల్ చెయిర్ అంటే.. పాటలు వస్తుంటాయి.. కుర్చీల చుట్టూ జనాలు తిరుగుతుంటారు. పాట ఆగిపోయినప్పుడు వెంటనే కూర్చోవాలి.. ఇది రూల్. కానీ ఈ సారి కాస్త కొత్తగా పెట్టారు. నెంబర్ వన్ జోడి అన్నారు కాబట్టి.. మగాళ్లు అంతా కూడా కుర్చీల చుట్టూ తిరుగుతారు. కానీ ఆడవాళ్లను ఎత్తుకుని మగవాళ్లంతా కూడా తిరుగుతారు.

Advertisement

Hyper aadi Fun Game In Sridevi Drama Company Latest Promo

దీంతో ఆది ఓ అమ్మాయిని ఎత్తుకుని సంబరపడ్డారు. ప్రతీ ఎపిసోడ్‌లో ఈ గేమ్ కచ్చితంగా ఉండేట్టు ప్లాన్ చేయండని ఆది తన మనసులోని కోరికలను బయటపెట్టేశాడు. దీంతో అందరూ నవ్వేశారు. ఈ ఆట బాగుందంటూ ఆడాళ్లను ఒళ్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆది. ఓ సందర్భంలో ఆది కిందపడిపోతాడు. కింద పడ్డా పర్లేదు.. అసలు ఈ గేమ్‌ను మాత్రం ఆపకండి.. అంటూ తనలో దాగివున్న ఆశలన్నీ తీర్చుకుంటున్నట్టుగా ఆది చెలరేగిపోయాడు. మొత్తానికి ఆది వేసిన కౌంటర్లకు అందరూ పగలబడి నవ్వేశారు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Contact Details: Prabhas29nov@gmail.com

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి