Hyper Aadi Gets Arrested In Sridevi Drama Company
Hyper Aadi : హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అవును ఇది నిజంగా జరిగిందా? అనే అనుమానాలు రాక మానవు. అయితే ఇదంతా జరిగింది శ్రీదేవీ డ్రామా కంపెనీ సెట్‌లో. మామూలుగానే ఆ షోలో ఈ మధ్య పిచ్చి వేషాలు ఎక్కువయ్యాయ్. ఏది నిజమో ఏది అబద్దమో అని భ్రమ పడేలా చేస్తున్నారు అక్కడి క్రియేటివ్ మేథావులు. అయితే అవన్నీ కూడా టీఆర్పీ స్టంట్లేనని జనాల ముందే పసిగట్టేస్తున్నారు. జనాలు ఎంత ద్వేషిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా కూడా మల్లెమాల టీం మాత్రం మారడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేయబోతోన్నట్టు చూపించారు. అందులో సడెన్‌గా సెట్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు.
ఇక్కడ హైపర్ ఆది ఎవరు అని అడుగుతారు. వచ్చేటప్పుడు నువ్ ఒకరికి యాక్సిడెంట్ చేశావ్.. చావు బతుకుల్లో ఉన్నావ్ అంటూ హైపర్ ఆదిని సదరు పోలీసోడు భయపెట్టేస్తాడు. దీంతో అక్కడి వారంతా కూడా షాక్ అవుతారు. ఇక సెట్‌లోని వారంతా వచ్చి కూడా పోలీసులను బతిమాలాడుతారు. సర్ పక్కకి రండి.. ఇక్కడ వద్దు అని అంటారు. కానీ పోలీసు మాత్రం వినడు. మీరంతా పక్కకి జరగండి.. ఏంట్రా అంటూ వీరంగం సృష్టిస్తాడు. సర్.. కాసేపు అయిన తరువాత వస్తాడు.. ఇప్పుడు షూటింగ్ జరుగుతోందంటూ వేడుకుంటారు. కానీ పోలీసోడు మాత్రం అస్సలు వినడు.
Hyper Aadi Gets Arrested In Sridevi Drama Company
సర్ తరువాత వస్తారు అని అంటే.. ఎవడ్రా నువ్.. అని అంటాడు. సర్ వస్తాం పదండి అని రాం ప్రసాద్ సర్ది చెబుతాడు. అలా వెళ్లడం కుదరదు అని సెట్‌లోని వ్యక్తి అంటే.. నువ్వు ఎవడ్రా వద్దని చెప్పడానికి వాళ్లు వస్తుంటే.. అని పోలీసు వ్యక్తి మరింత ఓవర్ యాక్షన్ చేస్తాడు. దీంతో జనాలు పసిగట్టేశారు. హైపర్ ఆదిని అరెస్ట్ చేస్తారా? అలా ఎందుకు చేస్తారు. చేయాలనుకుంటే ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వచ్చి చేస్తారా? ఇలాంటివెన్ని చూడలేదు అని జనాలు నానా రకాలుగా మల్లెమాల టీంని, శ్రీదేవీ డ్రామా కంపెనీని ఏకిపారేస్తున్నారు. మొత్తానికి ఈ టీఆర్పీ స్టంట్ల పిచ్చి పీక్స్‌కి చేరిపోయింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.