Home » Entertainment » Hyper Aadi Marriage News
Entertainment

Hyper Aadi : హైపర్ ఆదికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కట్నం ఎంతో తెలుసా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 28, 2022, 10:00 am
Advertisement

ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి సాధారణ కుటుంబం నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలలో తనదైన పంచులు వేస్తూ తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉండే ఆది అనూహ్యంగా జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి కంట పడటం.. అతడు తీసుకు వచ్చి ఆది కి తన టీంలో ఛాన్స్ ఇవ్వడం వంటివి అలా అలా కళ్ళ ముందు జరిగి పోయాయి. ఇప్పుడు కట్ చేస్తే ఆది కాస్త హైపర్ ఆది అయ్యాడు. ఇంజనీర్ అవ్వాల్సిన ఆది సూపర్ కమెడియన్ అయ్యాడు. మధ్య తరగతి కుటుంబం కాస్త ఉన్నత తరగతి కుటుంబం గా మారిపోయింది.

Advertisement

ఇదంతా కూడా జబర్దస్త్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు సినిమాల్లో చేస్తున్న హైపర్ ఆది పెళ్లి వయసు దగ్గర పడింది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు అని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది పెళ్లి విషయంలో చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. ఆయనకు కోట్లకు కోట్లు కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయని తెలుస్తోంది.ఇటీవల హైపర్ ఆది సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి సంబంధం కలుసుకోవడానికి ఆది కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెళ్ళాడట.

Hyper Aadi marriage news

Advertisement

ఆ సమయంలో హైపర్ ఆది కుటుంబ సభ్యులతో తన ఆస్తిలో సగభాగం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడట. ఆయనకు దాదాపుగా రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల ఆస్తి ఉంటుందని స్థానికులు ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఆది ఇప్పటి వరకు ఏ ఒక్క పెళ్లి సంబంధానికి కూడా ఓకే చెప్పలేదు. మరో వైపు ఆయన ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఆది పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి