Home » Entertainment » Hyper Aadi Missing From Dhee Dance Show Also After Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : ఢీ నుండి కూడా కనిపించకుండా పోయిన హైపర్‌ ఆది

Authored By
Himanshi
The Telugu News | Updated on: February 25, 2022 7:08 pm
Advertisement

Hyper Aadi : ఈ టీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి ఆది కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. కమెడియన్ హైపర్ ఆది లేని లోటు క్లియర్ గా మొన్న ఆదివారం కనిపించింది. ఆది లేకపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ గతవారం ఎపిసోడు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఆదివారం కూడా ఆది లేకుండానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో రాబోతుంది అని ఇప్పుడు ఇటీవలే విడుదలైన ప్రోమో తో క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఆదివారం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ జనాలు ఆదరించడం ఏమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆ తదుపరి ఎపిసోడ్ కైనా హైపర్ ఆది వస్తాడేమో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆది ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో లో కూడా కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇప్పటికే సుడిగాలి సుదీర్ ఢీ షో నుండి తప్పుకోవడంతో రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో మరింత దారుణమైన పరిస్థితికి ఆ షో పడిపోయే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా విడుదలైన ఢీ షో ప్రోమోలో ఆది లేకపోవడంతో మళ్లీ చర్చ మొదలైంది. మల్లెమాల కు హైపర్‌ ఆది చాలా కీలకం గా మారాడు అలాంటి హైపర్ ఆది ఈ మధ్య కాలంలో వరుస షో ల నుండి తప్పుకోవడంకు కారణమేంటి అనేది విశ్లేషకులు కూడా తేల్చుకోలేక పోతున్నారు.జబర్దస్త్ వచ్చే వారం ఎపిసోడ్ లో మాత్రం కనిపించబోతున్న హైపర్ ఆది ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. ముందు ముందు ఎపిసోడ్ లో అయినా ఆది ఉంటాడా లేదా అనేది చూడాలి.

hyper aadi missing from dhee dance show also after sridevi drama company

Advertisement

ఒకవేళ హైపర్ ఆది లేకపోతే మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ రెండు షో లు కూడా ప్రేక్షకులకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రెండు షో లు కూడా కచ్చితంగా హైపర్ ఆది వల్లే నడుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన లేని ఆ షో లను ఎవరు చూస్తారు. మల్లెమాల వారు ఆ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. హైపర్ ఆది ని మళ్లీ తీసుకురావాలని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ కారణంగా హైపర్ ఆది ఈ రెండు ఎపిసోడ్ లకు దూరం అయి ఉంటాడని.. తదుపరి ఎపిసోడ్‌ లకు మళ్ళీ ఆది వస్తాడు అంటూ ఈటీవీ వర్గాలవారు అనధికారికంగా చెప్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరో వారం లేదా రెండు పాటు వెయిట్ చేయాల్సిందే.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి