hyper aadi punches full fun to the audience
Hyper Aadi : బుల్లితెర పాపులర్ షోస్‌లో జబర్ధస్త్ షో కూడా ఒకటి.ఈ షో ద్వారా చాలా మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో హైపర్ ఆది ఒకరు. ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు . బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలట్లేదు కమెడియన్స్. హైపర్ ఆది ఇటీవలి కాలంలో ఈటీవీ ప్రతి షోలో కనిపిస్తున్నాడు. ఆయన చేసే సందడి మాములుగా ఉండదు. పంచ్‌లు అలా విసురుతూ ప్రేక్షకులని తెగ నవ్విస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది ఎక్స్‌ట్రా జబర్ధస్త్ స్కిట్‌లోతెగ నవ్వించాడు. పని అమ్మాయితో కలిసి ఆయన చేసిన సందడి వేరే లెవల్ అని చెప్పాలి.
పని అమ్మాయి హైపర్ ఆది.. డైలాగులు పెంచమని అడగగా, అందరు జీతాలు పెంచమని అడుగుతారు, నువ్వేంది డైలాగులు పెంచమని అడుగుతున్నావు అని ఆది అంటాడు. దానికి స్పందించిన పని అమ్మాయి వేరే వాడి స్కిట్ అనుకోండి జీతం పెంచమని అడుగుతాం, మీ స్కిట్ కాబట్టి డైలాగులు పెంచమని అడుగుతున్నాను. దీనికి ఆది నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు అని అనగా, రోజా మాకు కూడా ఉందని అంటాడు. ఇక మనో ఎక్కువగా కీమా తింటాడు అనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఇక ఈ స్కిట్‌తో ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు.
hyper aadi punches full fun to the audience
కమెడీయన్స్ ఫ్యామిలీ సభ్యులు హాజరై తెగ సందడి చేశారు. ఈ స్కిట్ అలరిస్తుంది. నేటి సాయంత్రం ఫుల్ స్కిట్ ప్రసారం కానుండగా, దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మాట మాటకు పంచ్ విసరడం, లేటెస్ట్ ఇష్యూలనే టార్గెట్ చేస్తుండటం ఆది నైజం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇన్సిడెంట్స్ తన స్కిట్స్‌కి ఆటం బాంబ్స్ అని ఫీలవుతుంటాడు హైపర్ ఆది. ఇక అనసూయ కనిపిస్తే మనోడి చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై హైపర్ ఆది- అనసూయ జోడీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆన్ స్క్రీన్‌పై చాలాసార్లు రొమాంటిక్ స్టెప్పులేసి బుల్లితెర ఆడియన్స్‌కి కిక్కిచ్చింది ఈ జోడీ.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.