Hyper Aadi Satires on Anchor Rashmi Telugu in Sridevi Drama Company
Rashmi Gautam : యాంకర్ రష్మీ మాతృభాష తెలుగు కాదు. ఆమెది ఒరిస్సా రాష్ట్రం. అయినా కూడా ఆమె తెలుగు నేర్చుకుంది. ఎన్నో కష్టాలు పడింది. తెలుగులో ప్రావీణ్యం సంపాదించకపోయినా కూడా చక్కగా మాట్లాడే స్థాయికి వచ్చింది. అయితే రష్మీ తెలుగును ఎప్పుడూ కూడా ఆది వంటి వారు తమ స్క్రిప్ట్, స్కిట్ల కోసం గేలి చేస్తుంటారు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలోనూ ఆది రెచ్చిపోయాడు. రష్మీ తెలుగును కించపరుస్తూ దారుణంగా కౌంటర్లు వేశాడు. అయితే రష్మీ మాత్రం ఇవన్నీ కూడా లైట్ తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే.
అయితే రష్మీకి నిజంగానే తెలుగు రాదా? కావాలనే అలాంటి తెలుగును మాట్లాడిస్తున్నారా? అదంతా కూడా స్క్రిప్ట్ అన్నదా? అన్నది ఎవ్వరికీ తెలియదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు అంటూ.. తన పెళ్లి కుదిరిందంటూ ప్రోమోలో రష్మీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి ఎలా జరుగుతుందో తెలుసా? అన్నట్టుగా రష్మీ చెప్పుకొచ్చింది. ఆకాశమంతా పంది అని ఏదో చెప్పబోతోంది రష్మీ.
Hyper Aadi Satires on Anchor Rashmi Telugu in Sridevi Drama Company
అది పంది కాదమ్మా.. పందిరి అని ఆది కౌంటర్లు వేస్తాడు. అదేలే ఆకాశమంత పందిరి అని రష్మీ మళ్లీ కవర్ చేస్తుంది. అయితే ఆ తరువాత అంగవంగ అని ఇంకేదో చెప్పబోతుంది. ఏంటమ్మా అని ఆది సెటైరికల్‌గా అంటాడు. అది అంగవంగ కాదు.. ఇంకా నయం అని ఓ మాదిరిగా అంటాడు ఆది.అలా రష్మీ తెలుగును కావాలనే ఇలా మార్చేసి కౌంటర్లు వేయిస్తున్నారు. నిజంగానే రష్మీ తెలుగును అలా మాట్లాడుతుందా? తప్పులు చేస్తుందా?అన్నది ప్రేక్షకులకు మాత్రం తెలియడం లేదు.
ఇక ఇదే ప్రోమోలో రష్మీ బయోగ్రఫీని చూపించారు. రష్మీ తాను ఎలా కష్టపడి వచ్చిందో.. చూపించారు. తన తల్లి తనను ఎలా పెంచిందో.. తన పేరెంట్స్ ఎందుకు విడిపోయారో కూడా చూపించారు. మొత్తానికి రష్మీ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ ఆదివారం ఫుల్ మీల్స్‌లా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఉండబోతోంది.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.