Home » Entertainment » Hyper Aadi Satires On Annapoornamma In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : మల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి పని చేస్తావా?.. అన్నపూర్ణమ్మ ఇజ్జత్ తీసిన హైపర్ ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 2, 2022 1:29 pm
Advertisement

Hyper Aadi : సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు ఇప్పుడు రెగ్యులర్ ఇన్ కమ్ వచ్చే సోర్స్ ఒకటి దొరికింది. అన్నపూర్ణమ్మకు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అంతగా ఆఫర్లు రావడం లేదు. ఏదో అడపాదడపా కారెక్టర్లు వస్తున్నాయి. అయితే బుల్లితెరపై మాత్రం అలా కాదు. రెగ్యులర్‌గా పని ఉంటోంది. కామెడీ షోల్లో అన్నపూర్ణమ్మ బాగానే సెట్ అయింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, మల్లెమాల స్పెషల్ ఈవెంట్లలో అన్నపూర్ణమ్మ బాగానే హల్చల్ చేస్తోంది. ఆమె తన కామెడీ టైమింగ్‌తో ఈ వయసులోనూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎన్నో ఎపిసోడ్స్‌లో పాల్గొంది.

Advertisement

అయితే అన్నపూర్ణమ్మ బుల్లితెరపై బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కొత్త గెటప్ కూడా వేసేసింది. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రోమో కానుంది. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా ఇది 75వ ఎపిసోడ్ అంటూ మరింత రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే.. పుష్ప సినిమా స్పూప్ వేశారు. అయితే ఇందులో కొత్తేమీ ఉండకపోవచ్చు. ఇది వరకు చాలా సార్లే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో స్పూప్ వేశారు. కానీ ఈ సారి మాత్రం ఓ స్పెషల్ ఉంది. అదేంటంటే.. అన్నపూర్ణమ్మ శ్రీవల్లిగా మారిపోయింది.

Hyper Aadi Satires On Annapoornamma In SRidevi Drama Company

Advertisement

దీంతో చూసే జనాలు ఒక్కసారిగా దిమ్మతిరిగిపడిపోయారు. శ్రీవల్లిగా ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణమ్మ.. తగ్గేదేలే అని అంటుంది. దీంతో ఆది అదిరిపోయే కౌంటర్ వేస్తాడు. ఏంటి తగ్గేదేలే.. ఆయాసమా? అని అంటాడు. దీంతో అందరూ గొల్లున నవ్వేస్తారు. ఇక మళ్లీ శ్రీవల్లి అందం గురించి మాట్లాడుతూ.. అన్నపూర్ణమ్మ ఓ డైలాగ్ వేస్తుంది. ఇన్నేళ్లు అయినా కూడా నా అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని అంటుంది. ఆ మాటకు హైపర్ ఆది కౌంటర్ వేస్తాడు. మల్లెమాల ఇచ్చే చెక్కుల కోసం ఇలాంటివి చెబుతారా? అంటూ అన్నపూర్ణమ్మ మీద ఆది కౌంటర్ వేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం హైపర్ ఆది వన్ మెన్ షోలా నడిపించేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి