hyper aadi satires on jhony master
Hyper Aadi: జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చి ప్రస్తుతం అన్ని షోలలో దుమ్ము రేపుతున్న కమెడీయన్ హైపర్ ఆది. జబర్దస్త్ షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరి ని కవర్ చేస్తూ అందరి పై పంచులు వేస్తూ ఉంటాడు.జబర్దస్త్ లో కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వారు ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో, ఢీ షోలోను మనోడు తెగ సందడి చేస్తుంటాడు. హైపర్ ఆది స్క్రీన్ మీదకు వచ్చాడంటే చాలు పడి పడి నవ్వుతుంటారు ఆడియన్స్. అంతగా పంచులు వేస్తుంటాడు ఈయన. అప్పుడప్పుడూ తన కడుపు మంటను కూడా అలాగే బయటపెడుతుంటాడు ఆది. కావాల్సిన వాళ్లపై కూడా పంచులు వేస్తుంటాడు.
ముఖ్యంగా ఢీ షోలో జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ తో పాటు అఖిల్‌లపై తెగ సెటైర్స్ వేస్తూ వస్తున్నాడు ఆది. శేఖర్ మాస్టర్ ఢీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. చాలా మంది జడ్జిలు మారుతున్నారు. మధ్యలో కొన్ని రోజులు గణేష్ మాస్టర్ వచ్చాడు. ఇప్పుడు కొన్ని వారాల నుంచి జానీ వస్తున్నాడు. ఆయన కూడా అక్కడున్న అమ్మాయిలతో పులిహోర బాగానే కలుపుతున్నాడు. గతంలో జానీ మాస్టర్‌పై తెగ సెటైర్స్ వేసి ఆది తాజా ఎపిసోడ్‌లోను తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.
hyper aadi satires on jhony master
తాజాగా ఢీ షోలో ఇద్దరు క్యూట్ పర్‌ఫార్మెన్స్ చేయగా, వారిపై ఆది సెటైర్స్ వేస్తూ.. మీకు ఢీ లేకపోయిన మంచి ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు. తణుకు సాయి, వణుకు నైనిక అంటూ ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు అని అన్నాడు. ఆ తర్వాత జానీ మాస్టర్ వేదికపై అమ్మాయితో డ్యాన్స్ చేస్తుండగా, దానికి ఆది తెగ పంచ్‌లు వేశాడు. ఎలా చేయాలో కూడా చేసి చూపించాడు. అంతే కాదు జానీ మాస్టర్ ఏదో లాగుతున్నట్టు డ్యాన్స్ చేస్తున్నాడు అంటూ సెటైర్ వేశాడు. ఏదేమైన మనోడి పంచ్‌లకు జడ్జెస్‌తో పాటు ఆడియన్స్
పగలబడి నవ్వారు. ప్రస్తుతం ప్రోమో వైరల్‌గా మారింది.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.