Home » Entertainment » Hyper Aadi Satires On Navya Swami Remuneration
Entertainment

Hyper Aadi : నవ్యస్వామి పరువుపాయే.. హైపర్ ఆది మామూలోడు కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 2, 2022, 8:00 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది చేసే కామెడీ, వేసే పెంచులు, సెటైర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆది మాత్రం కొన్ని సార్లు కాస్త హద్దులు దాటుతుంటాడు. హైపర్ ఆది వేసే పంచ్‌లు ఒక్కోసారి అవతలి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉంటాయి. కానీ అవన్నీ స్కిట్లో భాగంగానే అవ్వడంతో ఎవ్వరూ కూడా హర్ట్ అవ్వరు. కానీ చూసే జనాలకు మాత్రం అది ఇట్టే తెలిసిపోతుంది.ప్రస్తుతం ఆది జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఢీ షోలో మాత్రం కనిపిస్తూనే ఉన్నాడు.

Advertisement

ఇవన్నీ ఎప్పుడో షూట్ చేసిన ఎపిసోడ్‌లా? లేదంటే కొత్త ఎపిసోడ్‌లా అన్న విషయం తెలియడం లేదు. కానీ ఆది మాత్రం జబర్దస్త్ షోలో కనిపించకుండా.. ఢీ షోలో మాత్రమే కనిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు.ఇందులో సుష్మిత, నవ్యస్వామి ఇద్దరూ కలిసి ఆదితో ఎంట్రీ ఇచ్చారు. మేం ముగ్గురం ఇలా ఎంట్రీ ఇచ్చామని అంటారు. ఇక చూసుకోండి స్క్రీన్ స్పేస్ మొత్తం మేమే తినేస్తామని సుష్మిత అంటుంది.

Hyper Aadi Satires on Navya Swami Remuneration

Advertisement

ఆ మీరు స్క్రీన్ స్పేస్ తినండి.. నేను అని హైపర్ ఆది ఏదో అనబోయి ఆగిపోతాడు. ముగ్గురం ఒకే ఫ్రేములో ఉంటేనే అని నవ్యస్వామి ఏదో అనబోతోంది. అంతలోనే ఆది అందుకుని.. నాకున్న ఫేమ్ పోతుందని అంటాడు.ఇక అనంతరం ఆది, రవికృష్ణ ఇద్దరు కూడా స్టేజ్ మీద కూర్చుంటారు. వెంటనే ప్రదీప్ కర్చీప్ వేస్తాడు. ఆ వెంటనే నవ్యస్వామి రెండు వేలు, సుష్మిత ఐదొందలు వేస్తుంది. మీ రెమ్యూనరేషన్లు మొత్తం మాకే వేస్తే.. మీరెలా ఉంటారు అని వారి పరువుతీసేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి