Home » Entertainment » Hyper Aadi Satires On Nayani Pavani In Dhee Show
Entertainment

Hyper Aadi : నువ్ మరింత చీప్‌ ఆ?.. హద్దులు దాటిన హైపర్ ఆది కౌంటర్లు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: August 27, 2022 11:20 am
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై ఆది వేసే పంచ్‌లు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. ఇక అమ్మాయిల విషయంలో అయితే ఆది కాస్త అదుపుతప్పుతుంటాడు. అమ్మాయిల మీదున్న కోరికను వ్యక్త పరిచేలా కౌంటర్లు వేస్తుంటాడు. అతని చేష్టలు కూడా అలానే ఉంటాయి. హగ్గులు, ముద్దులు అంటూ ఎప్పుడూ ఆవురావురు అంటూ ఎదురుచూస్తుంటాడు. అయితే ఢీ షోలో ఈ మధ్య కౌంటర్లు కూడా గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు అందులో ఆది కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తోంది. వినాయక చవితి చందాలు అంటూ ముందుకు వచ్చాడు.

Advertisement

టీం లీడర్లను అడగవా? అని ప్రదీప్ అంటాడు. వాళ్లకే పాపం రోజుకు రెండొందలు ఇచ్చి.. రెండు పూటల భోజనం పెడతారు అంటూ నయని పావనిల పరువుతీస్తాడు ఆది. ఆ తరువాత వేలం పాట అనే స్కిట్ వేస్తారు. అందులోనూ ఆది ఇంకాస్త రెచ్చిపోతాడు. ఒకరిని మించి ఒకరు వేలం పాట పాడుతుంటారు. అయితే ఇందులో ఆది 25 పైసలు అంటూ యాడ్ చేస్తాడు. పైసలు ఇంకా ఉన్నాయా? అని పావని అంటుంది.నీ లాంటి వాళ్లు ఉన్నంత వరకు చిల్లర ఉంటుంది.. అని దారుణంగా కామెంట్ చేశాడు. అంటే ఆమెను చిల్లరది అన్నాడా? అనే అనుమానం వచ్చేలా ఆది పంచులున్నాయి.

Hyper Aadi Satires on nayani Pavani In Dhee Show

Advertisement

మరోసారి వేలం పాటలో భాగంగా ఆది ఓ రేట్ చెబుతాడు. మరీ ఇంత చీపా? అని పావని అంటుంది. నువ్ చీపా? అని ఆది రివర్స్ కౌంటర్ వేస్తాడు. అలా ఆది ఈ ప్రోమోలో బాగానే రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. వినాయక చవితి అని చెప్పడం, ఇలాంటి చిల్లర కామెంట్లు చేయడం ఆదికే చెల్లింది.ఇక ఈ ప్రోమోలో మాత్రం అఖిల్ కూడా మెరిశాడు. ఆది మీద మొదటి సారిగా వరుస పంచులతో రెచ్చిపోయాడు. ఈ షో నుంచి రవికృష్ణ, నవ్యస్వామిలు వెళ్లినట్టు అనిపిస్తోంది. రష్మీ సుధీర్ వెళ్లడంతో షో రేటింగ్స్ తగ్గిపోయాయన్న సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి