Home » Entertainment » Hyper Aadi Satires On Paradesi And Aishwarya
Entertainment

Hyper Aadi : రెచ్చిపోయిన పరదేశీ ఐశ్వర్య.. పరువుతీసిన హైపర్ ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 19, 2022 12:40 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. ఎవరి మీదైనా సరే ఆది పంచ్‌లు చకచకా వేసేస్తుంటాడు. అలాంటి ఆదికి ఎదురు ఎవరు నిలబడలేరు. ఇప్పుడు ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీతో బిజీగా ఉంటున్నాడు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం ఆది.. జబర్దస్త్ షోను వదిలేశాడు. మధ్యలో గ్యాప్ ఇచ్చేశాడు. ఇప్పటికీ రెండు నెలలు అవుతోంది. ఆది ఇంకా జబర్దస్త్ షోలోకి రావడం లేదు. కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రం రెట్టింపు వినోదాన్ని ఇస్తున్నాడు. అందరినీ కౌంటర్లతో రఫ్పాడిస్తున్నాడు. గత ఆదివారం నాడు ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఆది అందరినీ ఆడేసుకున్నాడు.

Advertisement

ఒక్కొక్కరినీ పంచులతో ఏడిపించేశాడు. అందరికీ జోడిలు ఇచ్చారు.. నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు అని బుల్లెట్ భాస్కర్ అంటాడు. నీకు ఏ జోడిని తీసుకురావాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉండి తీసుకురాలేదు.. దానికి మేం ఏం చేయాలంటూ ఆది పంచ్ వేశాడు. ఇక అలా ప్రతీ ఒక్కరి మీద కౌంటర్లు వేశాడు. ఇక చివరకు పరదేశీ లైన్‌లోకి వచ్చాడు. తనకు జోడిగా ఐశ్వర్యను పట్టుకొచ్చాడు. ఐశ్వర్యతో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యూచర్‌లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఫ్యూచర్‌లో ఐశ్వర్య అంటూ ఇలా పొగుడుకుంటూ వెళ్తాడు పరదేశీ. ఇక ఆది తన స్టైల్లో కౌంటర్లు వేసి నోర్మూయిస్తాడు.

Hyper Aadi Satires on Paradesi and Aishwarya

Advertisement

అసలు దానికి ఫ్యూచర్ ఉందా? అంటూ ఆది సెటైర్లు వేయడంతో అంతా నవ్వుతారు. ఐశ్వర్య నోరెళ్లెబెట్టేస్తుంది. అలా మొత్తానికి పరదేశీ, ఐశ్వర్యల జోడి గాలి తీసేస్తాడు ఆది. ఇక ఐశ్వర్యను రాం ప్రసాద్ పట్టుకెళ్తుంటే.. అది నా జోడి.. నువ్వెందుకు పక్కకు తీసుకెళ్తున్నావ్ అని పరదేశీ అంటాడు. నువ్వైనా కూడా పక్కకే కదా? తీసుకెళ్లేది అని ఆది కౌంటర్లు వేస్తాడు. అలా మొత్తానికి పరదేశీ ఐశ్వర్య జోడిని ఆది ఆడేసుకున్నాడు. నరేష్ పవిత్ర, బుల్లెట్ భాస్కర్ తండ్రి, ఫైమా ప్రవీణ్ జోడిలను కూడా ఆది వదిల పెట్టలేదు. ఆది దెబ్బకు అందరూ బలయ్యారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి