
Hyper aadi Satires on racha Ravi who came Back to Mallemala And ETV Show
Hyper Aadi : మల్లెమాల మీద ప్రస్తుతం ఎంత డ్యామేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. మల్లెమాలను, దాని అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు, వాటి చుట్టూ అల్లుకున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. వాటిని తిప్పి కొట్టేందుకు ఆది, రాం ప్రసాద్ వంటి వారు రంగంలోకి దిగారు. ఇక షేకింగ్ శేషు వంటి వారు కూడా కిరాక్ ఆర్పీని దారుణంగా అవమానించేశాడు. అలా మొత్తానికి మల్లెమాల మీద మాత్రం విపరీతంగా చర్చలు జరిగాయి.
కామెడీ స్టార్స్, స్టార్ మాలోని ఈవెంట్లు చేసుకుంటూ ఉన్న కిరాక్ ఆర్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఆర్పీ అక్కడి నుంచి కూడా బయటకు వెళ్లాడు. మధ్యలో వచ్చాడు. సినిమా అంటూ ఏదేదో చేశాడు. అయితే ఇప్పుడు స్టార్ మా కామెడీ స్టార్స్ నుంచి రచ్చ రవి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. అదేదో ఈవెంట్లో చమ్మక్ చంద్ర కాళ్లు మొక్కేశాడు రచ్చ రవి. తనకు లైఫ్ ఇచ్చింది చమ్మక్ చంద్ర అంటూ పొగిడేశాడు. అలాంటి రచ్చ రవి తిరిగి మళ్లీ ఈటీవీ, మల్లెమాలలోకి వచ్చాడు.
Hyper aadi Satires on racha Ravi who came Back to Mallemala And ETV Show
మల్లెమాల నుంచి రచ్చ రవి ఎప్పుడో బయటకు వెళ్లాడు. నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడో.. అప్పుడే చమ్మక్ చంద్ర, ఆర్పీ, రచ్చ రవి వంటి వారంతా కూడా వెళ్లిపోయారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ షోలు చేశారు. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు వీరంతా కూడా కామెడీ స్టార్స్ ధమాకా అనే షోలో చేస్తున్నారు. అయితే ఇప్పుడు రచ్చ రవి ఈటీవీ దసరా ధమాక ఈవెంట్లో మెరిశాడు. వచ్చిన రచ్చ రవి మీద ఆధి కౌంటర్లు వేశాడు. నాకు ఐదు అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి అని రచ్చ రవి అంటాడు. ఇలాంటివి మాట్లాడితేనే.. ఐదేళ్లు దూరంగా ఉన్నావ్ అని కౌంటర్ వేసి పరువుతీస్తాడు ఆది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.