Hyper Aadi Satires on Sudigali Sudheer on Rashmi in Sridevi Drama Company
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జోడికి ఓ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. గత తొమ్మిదేళ్లుగా ఈ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. ఇంకా ఈ ఇద్దరి జోడి మీద ప్రేక్షకులు ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. అయితే ఈ జోడి ఇప్పుడు వృత్తిపరంగా విడిపోయింది. ఇప్పుడు సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు.. రష్మీ ఏమో మల్లెమాల టీంలోనే ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చేసింది. కానీ మళ్లీ రష్మీ కూడా స్టార్ మాలోనే జంప్ అయ్యేట్టు కనిపిస్తోంది. అయితే సుధీర్ అక్కడకు వెళ్లినా కూడా రష్మీని మాత్రం వదలడం లేదు. హైపర్ ఆది ప్రతీ సారి బాబూ బాబూ అంటూ రష్మీని ఏడిపిస్తూనే ఉన్నాడు.
సుధీర్ టాపిక్ ఇండైరెక్ట్‌గా తీస్తూనే ఉన్నాడు. ఒక వేళ నిజంగానే సుదీర్, మల్లెమాల టీంకు గొడవలు జరిగి ఉంటే.. ఇలా సుధీర్ పేరును పదే పదే వాడుకునేందుకు అనుమతి ఇచ్చేవారా? అన్నది డౌటే. అయితే సుధీర్ వెళ్లిపోయినా కూడా మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు మాత్రం అతని జపమే చేస్తోన్నట్టు కనిపిస్తోంది. సుధీర్ రష్మీ జోడి బుల్లితెరపై ఎన్ని వేషాలు వేశారో అందరికీ తెలిసిందే. అదంతా కూడా డైరెక్షన్ టీం కాన్సెప్ట్ అయినా కూడా ఈ ఇద్దరూ మాత్రం బాగానే జీవించేశారు. ఈ ఇద్దరు నిశ్చితార్థం, పెళ్లి ఈవెంట్లు ఎన్నిసార్లు బుల్లితెరపై నడిపించేశారో అందరికీ తెలిసిందే.
Hyper Aadi Satires on Sudigali Sudheer on Rashmi in Sridevi Drama Company
అయితే ఈ జోడి మీద ప్రతీసారి హైపర్ ఆది ఏదో ఒక పంచులు వేస్తుంటాడు. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో రెచ్చిపోయాడు ఆది. సుధీర్‌ను జోలిని మళ్లీ తీశాడు. రష్మీ మీద సెటైర్లు వేశాడు. సుధీర్‌కి రష్మీ తొమ్మిదేళ్ల బంధానికి ప్రతీకగా.. తొమ్మిది గిఫ్టులు ఇచ్చిన స్కిట్ మీద కౌంటర్ వేశాడు. కరెక్ట్‌గా మీ ఇద్దరూ తొమ్మిదేళ్లు ఉంటే.. మీకే నిశ్చితార్థం, పెళ్లి అంటూ తొంభై గిఫ్టులు వచ్చేవి అంటూ సుధీర్, రష్మీ మీద సెటైర్లు వేశాడు ఆది. ఇక ఆది వరుసగా సుధీర్, రష్మీ వేసిన స్కిట్ల గురించి కౌంటర్లు వేస్తూ వచ్చాడు. దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోయింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.